మహాకూటమి పొత్తుల్లో భాగంగా.. తెలుగుదేశం పార్టీ మజ్లిస్ సిట్టింగ్ స్థానం మలక్‌పేటను తీసుకుంది. దీంతో చాలా మంది… ఇది రొటీన్‌గా… సంఖ్యలో చూపించడానికి తీసుకున్నారని అనుకున్నారు. కానీ.. తెలుగుదేశం పార్టీ ఆషామాషీగా ఆ సీటును తీసుకోలేదు. పక్కాగా… లెక్కలు వేసుకుని పోటీ ఇవ్వగమని నిర్ణయించుకున్న తర్వాతే పోటీకి సిద్ధపడింది. ఆ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి టీడీపీని అంటి పెట్టుకుని ఉన్న క్యాడర్ కూడా ఉంది. వారికి నాయకుడిగా ముజఫర్ అలీఖాన్ ఉన్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగక ముందు.. మలక్ పేట అతి పెద్ద నియోజకవర్గాల్లో ఒకటి. పునర్విభజనలో.. మలక్‌పేటకు.. ముస్లిం ఓటర్లు ఎక్కువగా చూసి విభజించారు. దాంతో.. 2009 , 2014 ఎన్నికల్లో మజ్లిస్ విజయం సాధించింది. 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రభుత్వ అభ్యర్థి ముజఫర్ అలీఖాన్ ఎంఐఎం అభ్యర్థి బలాలకు గట్టి పోటీ ఇచ్చి 8వేల ఓట్ల తేడాతోనే పరాజయం పాలయ్యారు.
గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా.. టీడీపీ పోటీ చేయలేదు. బీజేపీ పోటీలో ఉన్న కారణంగా… మజ్లిస్ అభ్యర్థి బలాల.. భారీ తేడాతో విజయం సాధించారు. ఈ సారి టీడీపీ తరపున ముజఫర్, ఎంఐఎం తరపున బలాల, టీఆర్ఎస్ తరపున చావ సతీష్, బీజేపీ తరపున ఆలె జితేందర్ పోటీ పడుతున్నారు. మలక్ పేట్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,79,766 అందులో పురుషులు -1,43,886 మహిళలు – 1,35,860 మంది ఉన్నారు. మలక్ పేట, సైదాబాద్, చంచల్ గూడ, అజంపురా, మూసారాంబాగ్, గడ్డి అన్నారం, చాదర్ ఘాట్ ప్రాంతాలు మలక్ పేట నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ముస్లిం ఓటర్ల కంటే.. హిందూ ఓటర్లు ఎక్కువే . కానీ.. మజ్లిస్ కోసం.. హిందూ ఓట్లను చీల్చేందుకు పార్టీలన్నీ హిందూ అభ్యర్థులనే నిలబెడతాయి. ఈ సారి టీడీపీ అభ్యర్థి ముజఫర్ అలీ ఖాన్‌కు సానుకూల వాతవరణం ఉందన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే బలాలపై వ్యతిరేకత ఉండటం.. ఎంఐఎం.. బీజేపీకి పరోక్షంగా సహకరిస్తుందనే ప్రచారం.. బలంగా వెళ్లడంతో.. మహాకూటమి వైపు ముస్లింలు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం ఉంది. పైగా.. టీడీపీ అభ్యర్థి ముజఫర్ అలీఖాన్… మలక్‌పేటలోనే ఉంటారు. క్యాడర్ తో.. ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు.
ఈ కారణంగా.. ఎంఐఎంను.. ముజఫర్ ఓడించినా ఆశ్చర్యం లేదన్న భావన వ్యక్తమవుతోంది. అయితే… ఎంఐఎంను గెలిపించేందుకే బీజేపీ ఓట్లను చీల్చుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి సానుకూల వాతావరణం ఉండటంతో.. మరిన్ని ఓట్లు చీల్చేందుకు… యోగి ఆదిత్యనాథ్‌తో మలక్ పేటలో ప్రచారం చేయించాలనే ఆలోచన చేస్తున్నారు. అయినా… మలక్ పేటలో ఈ సారి టీడీపీ జెండా ఎగురవేస్తానని.. ముజఫర్ అలీ ఖాన్ ధీమాగా ఉన్నారు. చంద్రబాబు కూడా రోడ్ షో నిర్వహించి వెళ్లారు.