ఏపీ ఫైబర్‌నెట్‌కు రోజుకు రూ. రెండు లక్షల జరిమానా చెల్లించాలని.. టీడీశాట్ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో బ్యాన్ చేసిన చానళ్లను.. తిరిగి ప్రసారం చేయాల్సిందేనని టీడీశాట్ ఉత్తర్వులిచ్చింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఫైబర్ నెట్ అమలు చేయలేదు. దీంతో.. టీవీ5 చానల్ మళ్లీ టీడీ శాట్‌లో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన టీడీశాట్ టీవీ5 చానెల్‌ను పునరుద్ధరించాలన్న.. మధ్యంతర ఉత్తర్వులను బేఖాతరు చేయడంపై సీరియస్ అయింది. చానల్‌ను తిరిగి ప్రసారం చేసే వరకు వరకు రోజుకు రూ.2 లక్షల జరిమానా విధించింది. ఇప్పటి వరకు జరిగిన ఉల్లంఘనలకు అదనంగా మరో రూ. 5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ జరిమానా మొత్తాన్ని టీడీశాట్‌కు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది.
నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని టీడీ శాట్ హెచ్చరించింది. చానల్స్ ను నిలిపివేయడం… ఉద్దేశ్యపర్వకంగానే చేసిన చర్యగా టీడీ శాట్ వ్యాఖ్యానించింది. ఫైబర్ నెట్ చర్యలపై తోలినించే అనుమానాలు ఉన్నాయని టీడీశాట్ చైర్మన్ మండిపడ్డారు. చానల్స్ నిషేధానికి
కారణాలు చూపకపోవడం తో పాటు అఫిడవిట్ ఫైల్ చేయకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. పైఅధికారుల ఆదేశాల వల్లనే చానల్స్‌ను బ్యాన్ చేశామన్న ఫైబర్ నెట్ వాదనను… ట్రిబ్యునల్ ప్రత్యేకంగా నోట ్చేసుుంది.
ప్రభుత్వ సంస్థ TDSAT లో మీకు అదేషలిస్తున్న ఆ ఉన్నత వ్యక్తి ఎవరని ప్రశ్నించింది. అయితే.. అధికారులు మాత్రం నీళ్లు నమిలారు. న్యూస్ ఛానల్ కు వుండే భావప్రకటన స్వేచ్చ ను ప్రభుత్వ సంస్థలు ఇలా ఉల్లంఘిస్తున్నట్లుగా ఆరోపణలు రావటం ప్రమాదకరం ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ఏపీ ఫైబర్ నెట్ ఇప్పటికీ తీరు మార్చుకోకపోతే.. చానల్స్ ను నిలిపివేయమని ఆదేశాలిచ్చిన అధికారిపైనే విచారణ జరుపుతామని టీడీశాట్ స్పష్టం చేసింది. ప్రభుత్వ మొండి వైఖరితో అధికారులు ఇరుక్కునే పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.