డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబు తనకు కేటాయించిన శాఖల విషయంలో తనదైన మార్క్ చూపించేందుకు కొత్త కొత్త ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం తన వ్యక్తిగత ఇమేజ్ ను కూడా ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆయన టీ విత్ డిప్యూటీ సీఎం అనే ప్రోగ్రాంను డిజైన్ చేయాలని అధికారులకు సూచించారు.
జంతు ప్రదర్శనల శాలలు.. ఇతర టూరిజం స్పాట్లను అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోనున్నారు. టీ విత్ డిప్యూటీ సీఎం అంటే… పవన్ కల్యాణ్ తో కలిసి టీ తాగండి అని పర్యాటకుల్ని ఆహ్వానించడమే. దానికి ఇంత అని రుసుము వసూలు చేయవచ్చు. పవన్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఆయనతో కాసేపు టీ టైమ్ ను స్పెండ్ చేయడం తమ హాలీడేలో భాగం అయితే చాలా మంది టూరిస్టులు… ఆసక్తి చూపిస్తారు. అందుకే పవన్ వ్యక్తిగతంగా కూడా తాను రాష్ట్రానికి ఉపయోగపడాలని నిర్ణయించుకున్నారు.
పంచాయతీరాజ్, పర్యావరణ శాఖల్లో తనదైన ముద్ర వేసే దిశగా ప్రాథమికంగా చేయాల్సిన పనులపై పవన్ కల్యాణ్ దృష్టి సారిస్తున్నారు. గత ప్రభుత్వం నిధులన్నీ నాకేయడంతో ఏం ముందుగా నిధుల్ని సమీకరించుకోవాల్సి ఉంది. బడ్జెట్ కేటాయింపులు.. కేంద్రం నిధులతో పాటు ఏ విధంగా సమీకరించుకోవచ్చో… దానికి తన సాయం ఎలాంటిదైనా చేయడానికి రెడీ అయిపోయారు.