ఏపీ ప్రభుత్వం టీచర్లను ఎన్నికల ప్రక్రియకు దూరం చేసి.. ఆ బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఇవ్వాలని ప్లాన్ చేసింది. దానికి తగ్గట్లుగానే టీచర్లకు బోధనేతర పనులు ఇవ్వకూడదని జీవో జారీ చేసింది. ఒక్క ఎలక్షన్ పనులే అంటే చెల్లవు కాబట్టి… బోధనేతర అని పేరు పెట్టారు. అంటే టీచర్లు పాఠాలు చెప్పడం తప్ప ఏ పనీ చేయకూడదు. ఇదే అంశాన్ని టీచర్లు ప్రస్తావిస్తున్నారు. దీంతో వారికి ఉన్న బోధనేతర పనులను .., గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించాలని నిర్ణయించారు.
ఇక నుంచి స్కూల్లో విద్యార్థుల హాజరును చూసుకోవాల్సింది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే. అయితే హాజరు మాత్రం ఉపాధ్యాయులే వేసుకోవాలి. హాజరు పరిశీలించి తక్కువగా స్కూలుకు వస్తున్న వారి తల్లిదండ్రులతో మాట్లాడాల్సింది ఈ ఉద్యోగులే. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం రికార్జులు కూడా వీళ్లే పరిశీలించాలి. మెనూ ప్రకారం ఫుడ్ పిల్లలకు అందుతుందో లేదో చూడాలి. ప్రతీ ఏఎన్ఎం విద్యార్థుల తల్లిదండ్రులను కలవాలి. అలాగే ఇంకా ఖరారు కాని మహిళా పోలీసులకూ విధులు కేటాయించారు. స్కూల్లో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేసి..దాంట్లో వచ్చే ఫిర్యాదుల్ని చూసి మహిళా పోలీసులు చర్యలు తీసుకోవాలి.
అంతే కాదు మరుగుదొడ్ల పరిశుభ్రత బాధ్యత ఇంజినీరింగ్ అసిసెంట్లకు అప్పగించారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు అనేక రకాల పనులతో ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ.. ఏ పని పడినా సచివాలయ ఉద్యోగులకే చెబుతున్నారు. అందరూ అన్ని పనులు మానేసి.. అసలు వ్యవస్థ మొత్తం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేయిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ పనులూ మీద వేస్తోంది ప్రభుత్వం మరో వైపు జీతం మాత్రం అందరి కన్నా తక్కువగా పే స్కేల్ నిర్ణయించారు. ఈ అసంతృప్తి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో పెరిగిపోతోంది .