టీచర్లకు బోధనేతర విధులు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టాన్ని తాము అమలు చేయదు అది వేరే విషయం. తాము ఎందుకు అలాంటి చట్టం చేశామో జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్‌కు బాగా తెలుసు. కానీ వారికి అప్పట్లో అర్థం కానిదేమింటటే.. తాము చేసిన చట్టం… తాము అనుకున్నపనికి వర్తించదని.
టీచర్లను ఘోరంగా వేధిస్తున్న ప్రభుత్వం వారిని పోలింగ్ విధులకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకుంది. అందుకే బోధనేతర పనులకు టీచర్లను వాడకూడదని చట్టంచేసింది. కానీ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం .. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని గుర్తించడం ప్రారంభించింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ విధుల్లో పాల్గొనే టీచర్ల జాబితా పంపాలని కోరింది. దీంతో ప్రభుత్వం.. టీచర్లకు బోధనేతర బాధ్యతలివ్వకూడదని చట్టం చేశామని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఆ చట్టాన్ని ఈసీ పనులకు వర్తింపచేయలేరని సూటిగా సమాధానం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈసీ పని తీరును.. పోలింగ్ సిబ్బందిని డిసైడ్ చేసే విషయంలో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు వచ్చాయని చెబుతున్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం … సచివాలయ ఉద్యోగుల్ని తీసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. ఈ అంశంపై ఏపీ సర్కార్ ఏదో ఒకటి చేయాలనుకుంటోంది. టీచర్లను ఎన్నికలకు విధులు పంపిస్తే.. వారి కోపం అంతా తమపై చూపిస్తారని ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ దారుణమైన తీరు.. ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ల ఓవరాక్షన్ కలిపి.. ప్రభుత్వంపై టీచర్లు తిరుగుబాటు చేయడం మాత్రమే మిగిలింది. ఈసీ టీచర్ల విషయంలో వెనక్కి తగ్గకపోతే కోర్టుకు వెళ్లాలన్న ఆలోచన కూడా చేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
అసలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఓటర్ల జాబితాలను గోల్ మాల్ చేసి.. సచివాలయ వ్యవస్థ ద్వారా..ఎన్నికలు నిర్వహించేయాలని జగన్ రెడ్డిప్లాన్. ఇప్పుడు మొత్తం రివర్స్ అయ్యే పరస్థితి కనిపిస్తోంది.