భారత టీ20 జట్టు రూపురేఖలు మారబోతున్నాయ్. కోహ్లి, రోహిత్ బాటలో మరో సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించారు. ఈ వరల్డ్ కప్ విజయం తర్వాత ఈ ముగ్గురు ఆటగాళ్ళు తప్పుకోవడం జట్టులో స్టార్ ఎట్రాక్షన్ తగ్గిపోయినట్లేనని చెప్పుకోవాలి. కోహ్లి, రోహిత్, జడేజా ఈ ముగ్గురు కూడా జట్టుకు పుష్కలంగా సేవలు అందించారు. సుదీర్గంగా కెరీర్ ని కొనసాగించారు. వరల్డ్ కప్ విజేతలుగా నిలిచారు. పొట్టి ఫార్మెట్ కి గుడ్ బై చెప్పడానికి ఈ ముగ్గురికది సరైన సమయమే.
అయితే కేవలం టీ20లకే కాదు… ఈ ముగ్గురు రానున్న రోజుల్లో మిగతా రెండు ఫార్మెట్స్ లో రిటైర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ప్రతి రెండేళ్ళకు జరిగే టీ20 వరల్డ్ కప్ కే రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ఐదేళ్ళకు జరిగే ప్రపంచ కప్ లో వాళ్ళు అందుబాటులో వుండే అవకాశం చాలా తక్కువ.
ఏ జట్టు అయినా ప్రపంచకప్ ని ద్రుష్టిలో పెట్టుకునే టీంని సిద్ధం చేస్తుంటుంది. ఇప్పుడు భారత్ ముందు కూడా ఇదే లక్ష్యం వుంది. ఈ ముగ్గురి ఇంకెంతకాలం కొనసాగుతుందో ప్రస్తుతానికి చెప్పలేం కానీ వచ్చే వరల్డ్ కప్ కి ఆడే అవకాశాలు మాత్రం ఉండవని విశ్లేషకుల మాట.
పైగా ఇప్పుడు జట్టు కోచ్ గా గౌతమ్ గంభీర్ రావడం ఖయమైయింది. ఆయన ద్రుష్టి అంతా ప్రపంచ కప్ పై వుంది. సీనియర్ల తప్పుకోవాలని, వ్యక్తిగత రికార్డుల ఆట పక్కన పెట్టి, కప్పుల వేట మొదలుపెట్టాలని ముందు నుంచి సూచిస్తూనే వున్నాడు. జట్టుకు కావాలని ఆయన వాదన. ఇలాంటి నేపధ్యంలో రానున్న వన్డే ప్రపంచ కప్ జట్టు స్వరూపం కూడా పూర్తిగా మారనుంది.