ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడానికి బయలుదేరిన విమానం కొంత దూరం వెళ్లిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తడంతో వెనక్కి వచ్చింది. తర్వాత వెరొక విమానం తెప్పించుకుని రాత్రి పది గంటల సమయంలో మళ్లీ ఢిల్లీ బయలుదేరారు. అంత వరకూ బాగానే ఉన్నా.. అసలు విమానం టెన్షన్ గురించి విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి అంటే వీవీఐపీ. ఆయన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం చిన్న విషయం కాదు.
కానీ విమానం గాల్లోకి లేచిన తర్వాత కొంత దూరం వెళ్లిన తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. దీంతో అందరూ హడలెత్తిపోయారు. పైలెట్ వెంటనే… గన్నవరం ఎయిర్ పోర్టుకు సమాచారం ఇచ్చి అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆ తర్వాత జగన్ ఎప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లినా… ఓ విమానాన్ని పంపుతారని.. కానీ ఈ సారి ఆ విమానాన్ని పంపలేదని కొత్త విమానం పంపారని అంటున్నారు. అయితే విమానాలు అద్దెకు ఇచ్చే కంపెనీ ఒకటే పంపాలని రూల్ ఏమీ లేదు. అయినా ఏదో కుట్ర ఉందన్న ప్రచారాన్ని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
నిజానికి ఎయిర్ పోర్టు డైరక్టర్ల దగ్గర్నుంచి ఏవియేషన్ సలహాదారు వరకూ అందరూ హైలీ రెస్పెక్టెడ్ అండ్ పర్సనల్ ఆసక్తిగా నియమించిన వారే. ఇప్పుడు వారిపైనే దర్యాప్తు చేయాల్సి వస్తోంది. అయితే ఇది అనుకోకుండా నే ఏర్పడిన సాంకేతిక సమస్య అని… ఇందులో కుట్ర ఏమీ లేదని ఎయిర్ పోర్టు డైరక్టర్ చెబుతున్నారు కానీ పెద్దలు మాత్రం నమ్మలేకపోతున్నారు. విచారణకు ఆదేశించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.