తమిళ రీమేక్ ఎబిసిడి వ్యవహారం భలే చిత్రంగా వుంది. వున్న టెక్నీషియన్ ను కంటిన్యూగా వుంచుతున్నట్లు లేదు. సినిమా ఆరంభంలోనే సినిమాటోగ్రాఫర్ గా శ్యామ్ కే నాయుడు ను అనుకున్నారు. కానీ తరువాత మార్చినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరక్టర్ ను కొత్తగా కన్నడ రంగం నుంచి హీరో శిరీష్ కావాలని పట్టుకువచ్చారు. కానీ ఇప్పుడు రీ రికార్డింగ్ ను వేరే వాళ్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఎడిటిర్ ను కూడా మధ్యలో మార్చారని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా వుంటే ఇప్పుడు చివరాఖరికి పీఆర్ టీమ్ ను కూడా శిరీష్ మార్చినట్లు తెలుస్తోంది. తనకు అత్యంత సన్నిహితమైన పీఆర్ టీమ్ వుండగా, అదనంగా మరో టీమ్ ను కూడా హైర్ చేసినట్లు తెలుస్తోంది. అల్లు శిరీష్ గట్టిగా ఎక్కువ సినిమాలు చేయకుండానే మరీ ఇంతలా ఇన్ వాల్వ్ అయిపోయి, జనాలను అటు ఇటు మార్చేస్తుండడం చిత్రంగా వుంది.
ఇదిలా వుంటే నిన్నటికి నిన్న అల్లు అరవింద్ ఎబిసిడి సినిమా చూసారు మరి ఆయన స్పందన ఏమిటన్నది ఇంకా తెలియలేదు. ఈ సినిమా ఈ ఆరంభంలో విడుదల కావాల్సి వుంది,. మూడో వారానికి వాయిదా పడింది. మరి అప్పుడు పక్కానా, కొత్త డేట్ వస్తుందా? అన్నది చూడాలి.