రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో నెంబర్ టార్గెట్ గా మారారు. ఆయనపై బీఆర్ఎస్, బీజేపీ నేతలే కాదు..కాంగ్రెస్ లోని ఓ వర్గం కూడా విరుచుకుపడుతున్నారు. ఆయనను ఎలాగైనా బలహీనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ జాబితాలోకి తీన్మార్ మల్లన్న కూడా చేరారు. ఇంతకు ముందు ఆయన బీసీ నినాదం ఆవేశంలో ఏదో చేస్తున్నారని అనుకునేవారు కానీ.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ప్రెస్మీట్ పెట్టి రేవంత్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన బీజేపీని బలోపేతం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని ఎంపీ స్థానాల్లో ఆయనే బీజేపీని గెలిపించాలన్నారు. అంతే కాదు.. అసలు రేవంత్ సీఎం సీటుకు తానే పునాది వేశానని చెప్పుకొచ్చారు.
మల్లన్న చాలా మాట్లాడారు కానీ.. రేవంత్ ను ఈ స్థాయిలో టార్గెట్ చేయడం మాత్రం కలకలం రేపింది. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు వచ్చింది రేవంతే.. చాలా వరకూ ఆయనకు ఎంపీ.. ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించేందుకు ప్రయత్నించారు.కుదరకపోయే సరికి ఎమ్మెల్సీ ఇప్పించారు.కానీ మల్లన్న రేవంత్ సీఎం అయిందే తన వల్ల అని చెప్పుకోవడం కాకుండా ఆయనపై బీజేపీ ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. మల్లన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సహజంగానే కలకలం రేపుతున్నాయి. వ్యూహాత్మకంగా మల్లన్న ఈ వ్యాఖ్యలు చేశారన్నట్లుగా.. వెంటనే ధర్మపురి అర్వింద్ ప్రెస్మీట్ పెట్టి.. రేవంత్ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు.
రేవంత్ రెడ్డి ఎంత బలమైన నాయకుడిగా ఎదకకపోతే ఇంత మంది టార్గెట్ చేస్తారని ఆయన సన్నిహితులు అంటున్నారు. పార్టీలకు అతీతంగా ఒక్కడు ఒక వైపు ఉంటే.. మిగతా అంతా రేవంత్ కు వ్యతిరేకంగా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి బలపడితే ఇక తమకు చాన్స్ ఉండదని మిగతా వారంతా ఏకమవుతున్నారు. కానీ వారు అలా చేయడం వల్లనే రేవంత్ మరింత బలోపేతం అవుతున్నారన్న వాదన వినిపిస్తోంది.