నేనే రాజు – నేనే మంత్రి కాంబో మళ్లీ రిపీట్ కాబోతోంది. తేజ దర్శకత్వంలో నటించడానికి రానా ఓకే చెప్పాడు. కథ కూడా సిద్దమైంది. ఈ చిత్రానికి గోపీచంద్ ఆచంట ఈ చిత్రానికి నిర్మాత. ఇదో యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ‘రాక్షస రాజ్యంలో రావణుడు’ అనే టైటిల్ తో ఓ కథ ఇది వరకే రెడీ చేశారు తేజ. నేనే రాజు నేనే మంత్రి తరవాత ఈ సినిమానే పట్టాలెక్కాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి.. ఈ కాంబో తెరపైకి వచ్చింది. ఈసారి… తేజ రానా కోసం పూర్తిగా కొత్త కథ రాసుకొన్నట్టు సమాచారం. రాక్షస రాజ్యంలో.. కథని పక్కన పెట్టేశారని తెలుస్తోంది. గోపీచంద్ కాంబోలో తేజ ఓ సినిమా చేయాల్సింది. అది కూడా ఆగిపోయింది. ఆ తరవాతే.. దగ్గుబాటి అభిరామ్ తో ‘అహింస’ మొదలెట్టారు. ఈ సినిమా ఎప్పుడో పూర్తయ్యింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా మళ్లీ దగ్గుబాటి హీరోతోనే సినిమా ఓకే చేయించుకొన్నాడు తేజ.