అ, కల్కి, జాంబీరెడ్డి సినిమాలతో.. తనదంటూ ఓ ముద్ర వేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. మూడూ మూడు విభిన్నమైన జోనర్లే. ఇప్పుడు `హనుమేన్` కథని తెరపైకి తీసుకొస్తున్నాడు. మన పురాణాల్లో సూపర్ మాన్… హనుమాన్. హాలీవుడ్ లో సూపర్ హీరోల కథలకు ఓరకంగా హనుమాన్ నే స్ఫూర్తి. అందుకే హనుమాన్ తోనే తెలుగులో తొలి సూపర్ హీరో సినిమా తీస్తానంటున్నాడు ప్రశాంత్ వర్మ. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అయితే హీరో ఎవరన్నది చెప్పలేదు. ఆ ఛాన్స్… తేజ సజ్జాకి దొరికిందని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ `జాంబిరెడ్డి`తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తేజ. అంతకు ముందు `ఓ బేబీ`లో ఓకీలకమైన పాత్రలో కనిపించాడు. ఇప్పుడు మరోసారి.. ప్రశాంత్ వర్మ తేజపైనే నమ్మకం ఉంచాడు. `హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ అని తెలుస్తోంది. అందులో హనుమంతుడి కథని తెలివిగా మిక్స్ చేస్తున్నాడట. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్కీ ప్రాధాన్యం ఉందని, మిగిలిన భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది.