చిత్రం సినిమాతో తేజ ఓ ఉప్పెనలా వచ్చాడు. చిన్న సినిమాకు వెన్నుదన్నుగా నిలిచిన చిత్రమది. ఈ సినిమాతో ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. అందులో ఉదయ్ కిరణ్ ఒకడు. ఆ తరావత.. నువ్వు – నేనుతో ఉదయ్ ని ఓ యూత్ ఐకాన్ గా మార్చేశాడు. ఆ ప్రస్థానం తెలిసిందే. ఇప్పుడు `చిత్రం 1.1` పేరుతో చిత్రంకి సీక్వెల్ చేయాలని డిసైడ్ అయ్యాడు తేజ. తనకెన్నో మంచి పాటలు ఇచ్చిన ఆర్పీ పట్నాయక్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. `చిత్రం`లానే ఈసినిమాలోనూ అందరూ కొత్తవాళ్లనే తీసుకోవాలని భావిస్తున్నాడుతేజ. ఇప్పుడు తనకు ఓ ఉదయ్ కిరణ్ కావాలి.
ఆ ఉదయ్ కిరణ్ తేజ ఇంట్లోనే ఉన్నాడు. తేజ తనయుడు అమితవ్ తేజని.. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేయాలని తేజ భావిస్తున్నట్టు సమాచారం. అమితవ్ కి ఇప్పుడు నటనలో శిక్షణ ఇప్పిస్తున్నాడట. తన కథకు అమితవ్ సరిపోతాడని తేజ భావిస్తున్నాడని, అయితే… త్వరలో తేజ ఓ ట్రైల్ షూట్ ప్లాన్ చేస్తున్నాడని, అమితవ్ నటన సంతృప్తిగా అనిపిస్తే… ఈ సినిమాలో తనే హీరో అని తెలుస్తోంది.