ప్రేమకథల నిపుణుడు తేజ ప్రస్తుతం ‘అహం’ అనే సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో విలన్ గా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ను తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే కొద్దిరోజులుగా తేజ, రాజశేఖర్ ల మధ్య గొడవ జరిగిందని.. ఆ కారణం చేతే రాజశేఖర్, తేజ సినిమా నుండి తొలగించబడ్డారని ఒకటే హడావిడి చేశారు. ఐతే ఈ న్యూస్ ఆనోటా ఈనోటా పడి రాజశేఖర్ దాకా వెళ్లిందట.
అసలు సినిమానే స్టార్ట్ అవ్వలేదు ఇంతలో గొడవలెలా సృష్టించారంటూ మీడియాపై కస్సు బుస్సు లాడుతున్నాడు రాజశేఖర్. ఇలాంటి న్యూస్ లు రాసేముందు అది జరిగిందా లేదా అని తెలుసుకుని రాస్తే మంచింది చురకలు వేశారు. తేజ సినిమా ఇంకా కథా చర్చల్లోనే ఉందని.. సినిమా షూటింగ్ గురించి ఇంకా డేట్స్ ఫిక్స్ చేయలేదని అన్నారు రాజశేఖర్. సో మీడియా మరి చొరవ చూపించి తేజ ‘అహం’ నుండి రాజశేఖర్ అవుట్ అని హెడ్డింగులు పెట్టి మరి న్యూసెన్స్ క్రియేట్ చేసింది. రాజశేఖర్ ఇలా ఫైర్ అయ్యాడంటే ఇక తేజ ఈ విషయం పట్ల ఎలా స్పందిస్తాడో చూడాలి.