ఓటీటీ వల్ల దర్శక నిర్మాతలకు కొత్త దారులు దొరికాయి. వెబ్ సిరీస్‌లూ, వెబ్ మూవీలకు వేదిక కనిపించినట్టైంది. ఈ కోవలో..ఓ వెబ్ మూవీ రూపొందించారు తేజ. తన శిష్యుడి కోసం. కథ తేజదే. నిర్మాత కూడా ఆయనే. నిజం కాలంలో జరిగే ఓ కథ ఇది. చాలా బోల్డ్ గా ఉంటుందట. 30 నిమిషాల పాటు సాగే ఈ వెబ్ మూవీ.. షూటింగ్ కూడా పూర్తయింది. తేజ దగ్గర గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న రాకేష్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ వెబ్ మూవీ షూటింగ్ సమయంలోనే తేజకు కరోనా సోకిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని, ఇప్పుడు కోలుకుంటున్నారని సమాచారం. అమేజాన్‌లో ఈ వెబ్ మూవీ స్ట్రీమ్ అయ్యే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.