ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వెహికల్ ( పాలసీ తీసుకొచ్చారు. ఈ ప్రకారం జీవో నెం.41 తీసుకు వచ్చారు. ఈ పాలసీ రెండేళ్ల పాటు ఈవీ పాలసీ అమల్లో ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ పాలసీ నవంబర్ 18 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు ఎలట్రిక్ వాహనాల్లో టూ వీలర్స్, 4 వీలర్స్ & కమర్షియల్ వాహనాలకు 100% పన్ను మినహాయింపు ఉంటుంది. వీటితో పాటు ఈవీల రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయిస్తున్నారు.
ఇటీవవలి కాలంలో ఈవీల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కారణంగా కేంద్రం కూడా ఇటీవల ప్రోత్సాహకాలు తగ్గించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈవీ పాలసీలో ప్రోత్సాహకాలు ఇస్తోంది. రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించడం వల్ల కొనుగోలుదారులకు చాలా మేలు జరుగుతుంది. కారు కొనుగోలు చేసే వారికి లక్షల్లోనే సేవ్ అవుతుంది. ప్రజలు తమ ఆలోచనలు మార్చుకుంటున్నారు. ఈవీల వైపు మొగ్గుచూపుతున్న పరిస్థితి కనిపిస్తున్న సమయంలో తెలంగాణ సర్కార్ నిర్ణయం మేలు చేసేదే.
తెలంగాణను ఈవీల హబ్ గా మార్చాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ విషయంలో పరిశ్రమల్ని ఆకర్షించడానికి కూడా ఈ రాయితీలు ఉపయోగపడతాయని.. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ కంపెనీలు కూడా పెట్టుబడులకు తెలంగాణ వైపు చూస్తాయని అంచనా వేస్తున్నారు.