తెలంగాణ అసెంబ్లీ సోమవారం రికార్డు స్థాయిలో పనిచేసింది. ఉదయం నుండి బడ్జెట్ లో ఆయా శాఖలకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ప్రొవిజన్స్ పై చర్చ జరిగింది. ప్రభుత్వం పెట్టిన పద్దులు, గతంలో అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలు, అంతకు ముందు ప్రభుత్వాలు చేసిన పనులపై సభ్యులు చర్చించారు.
మొదట్లో వాదోపవాదాలు గట్టిగానే జరిగాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడినప్పుడు సర్కార్, విపక్షాల మధ్య వాతావరణం వేడెక్కింది. ఆ తర్వాత సాఫీగానే సాగాయి.
Also Read : పాపం బీఆర్ఎస్ నేతలు!
అయితే, కొత్తగా ఎన్నికైన సభ్యులకు సభలో పద్దులపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రతి సభ్యుడికి కనీసం 15నిమిషాలు అవకాశం ఉంటుందని చెప్పారు. కొందరు సభ్యులు అంతకు మించి సమయం తీసుకోవటం, అధికార పక్షం నుండి సమాధానాలతో పాటు చివరగా మంత్రుల సమాధానాలు ఇచ్చే సరికి అర్ధరాత్రి దాటిపోయింది. అయినా సభను స్పీకర్ కంటిన్యూ చేసి చివరకు తెల్లవారుజామున 3.16నిమిషాల సమయంలో వాయిదా వేశారు.
సభ తిరిగి మంగళవారం ఉదయం 10గంటలకు మొదలుకానుంది. మొదటి రోజు 19పద్దులపై చర్చ జరగ్గా, రెండోరోజు కూడా కీలకమైన పద్దులపై చర్చ సాగే అవకాశం ఉంది.