నేటి నుండి తెలంగాణా రాష్ట్ర శాసనసభ సమావేశాలు మొదలవుతాయి. ఉదయం 10గంటలకు ఉభయసభలు ప్రారంభం అయిన తరువాత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరియు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మృతికి సంతాపం ప్రకటిస్తారు. గణేష్ నిమజ్జనం, బక్రీద్ పండుగ సందర్భంగా ఐదు రోజులు శలవు తీసుకొని మళ్ళీ 29నుండి సమావేశాలు మొదలవుతాయి. మధ్యాహ్నం 12గంటలకు బి.ఏ.సి. (బిజినస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశం నిర్వహించి శాసనసభ సమావేశాల షెడ్యుల్ ఖరారు చేస్తారు. ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కోరితే అన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే హామీ ఇచ్చారు కనుక ఈ విషయంలో ప్రతిపక్షాలకు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి అవకాశం లేదనే చెప్పవచ్చును. శాసనసభ సమావేశాలు కనీసం రెండు వారాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.