సంక్షేమ పథకాల్లో కేసీఆర్ ను కొట్టలేము… ఆయన తోపు..తురుము అనే మాటలు తెలంగాణ వ్యాప్తంగా రోజూ వినిపిస్తాయి. మంత్రులు, బీఆర్ఎస్ నేతలు అదే చెబుతూంటారు. ఇదంతా మామూలే. కానీ… ఇప్పుడు బీజేపీ నేతలు కూడా అదే అందుకుంటున్నారు. సంక్షేమ పథకాలల్లో సీఎం కేసీఆర్‌ను కొట్టలేమన్నారు. కేసీఆర్‌ను కొట్టాలంటే ఆయనిచ్చిన హామీలు అమలులో లోపాలతోనే కొట్టాలని.. లేకుంటే కేసీఆర్ కు ఓడించటం కష్టమంటూ చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ ఒక్కటే అని కూడా సర్టిఫికెట్ ఇచ్చారు.
బండి సంజయ్ మార్పు కారణంగా బీజేపీ డ్యామేజీ అయిందనడం కరెక్ట్ కాదన్నారు. అధ్యక్షుడిని ఎందుకు మార్చారో మార్చిన వాళ్లకు బాగా తెలుసని.. నేతలను కలుపుకుపోవటం లేదనే బండి సంజయ్‌ను తప్పించారని వెల్లడించారు. మురళీధర్ రావు వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలోనూ కలకలం రేపుతున్నాయి. బండి సంజయ్ ను తప్పించింది.. .. బీఆర్ఎస్ కోసమని… ఓ వైపు లిక్కర్ స్కామ్ లో కవితను పక్కన పెట్టేసి… మరో వైపు పార్టకి ఊపు తెచ్చిన బండి సంజయ్ ను ఇతర రాష్ట్రాలకు పంపిచేస్తూ… సొంత పార్టీని డ్యామేజ్ చేసుకుంటూ ఏం సాధిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ కార్యకలాపాలు పూర్తిగా నీరసించి పోయాయి. ఆయనకేంద్ర మంత్రిగా ఉండటంతో… ఆ పనుల కోసం తిరగాల్సి వస్తోంది. తెలంగాణలో ఏ ధర్నాలు చేపట్టినా… జరుగుతున్నాయో లేదో అనే పరిస్థితికి వెళ్లిపోయింది. దానికి తోడు.. కేసీఆర్ ను పొగడ్తల్లో ముంచెత్తే నేతలు నోరు అదుపు చేసుకోలేకపోతూండటంతో… మొదటికే మోసం వస్తుంది. ఎన్నికలకు ముందు ఇంత ప్రణాళిక లేకుండా ఎందుకు తమ నెత్తిపై చేయి పెట్టుకుంటున్నారన్న ఆందోళన సహజంగానే బీజేపీ క్యాడర్ లో కనిపిస్తోంది.