బీజేపీకి ప్రాంతీయ పార్టీలంటే పావులు. మద్దతిచ్చేందుకు పోటీ పడుతున్న పార్టీలను ఆ పార్టీ ఓ ఆట ఆడుకుంటోంది. ముఖ్యంగా ఏపీలో ఈ పరిస్థితి విచిత్రంగా ఉంది. అక్కడ బీజేపీ లేదు. కానీ ఆ పార్టీకి మద్దతివ్వడానికి అధికార, ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. దీన్నే అలుసుగా చేసుకుని ఇతర చోట్ల తమ రాజకీయ ఆటలు ఆడుతోంది బీజేపీ. టీడీపీ, వైసీపీ.. బీజేపీ తమకు దగ్గరంటే తమ కు దగ్గర అని ప్రచారం చేసుకుంటున్నాయి. మీతో నిలబడి భేటీ అయితే తమతో భోజనం చేశారని చెప్పుకుంటున్నారు. కానీ తమను బీజేపీ అలా వాడుకుంటోందని మాత్రం గుర్తించలేకపోతున్నారు.
బీజేపీ రెండు పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీనికి కారణం తెలంగాణలోని సెటిలర్ల ఓట్లే. ఆంధ్రా సెటిలర్లను ఆకర్షించేందుకు టీడీపీ, వైసీపీ లతో తమకు వైరం ఏమీ లేదనే సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తుంది. రెండు పార్టీలకూ అక్కడ సానుభూతి పరులు ఉన్నారు. వాళ్లను బట్టులో వేసుకునేందుకే వేసుకునే బీజేపీ ఆకస్మాత్తుగా టీడీపీ, వైసిపీలతో సన్నిహితంగా మెలుగుతున్నారు .
అయితే తమను తెలంగాణలో వాడేసుకుంటున్నారని రెండు పార్టీలకు తెలియదా.. అంటే తెలుసు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్లకి తెలంగాణ కార్యక్షేత్రం కాదు. ముందు ఏపీలో పట్టు ఉండాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. అందు కోసం బీజేపీ చల్లని చూపులు కావాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ వేస్తున్న ఎత్తులను ,వ్యూహాలను ఏపీ నాయకులు గమనిస్తూనే ఉన్న భరిస్తున్నారు.