ప్రజా గోస, బీజేపీ భరోసా పేరుతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లను బీజేపీ నిర్వహిస్తోంది. యూపీలోలా మూడంచెల సభల వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు పెడుతున్నారు. బీజేపీ జాతీయ అగ్ర నేతలు 15 రోజుల్లో 11వేల సమావేశాలు నిర్వహిం చాలని టార్గెట్ పెట్టారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో ముఖ్య నేతలతో పాటు- మండల స్థాయి నేతల వరకు పాల్గొనాలని ఆదేశించారు. సమావేశాల్లో పొల్గొనే నేతల కు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు.
తీరా పది రోజులుగా సమావేశాలు జరుగుతున్నా కొంతమంది నేతలు బయటకు రావ డంలేదు. కొంతమంది నాయకులు తమకు ఇచ్చిన కార్యాచరణను పట్టించుకోవడం లేదు. దీంతో ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు తేలిపోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. శక్తి కేంద్రాల అధ్యక్షులు 80 శాతం మంది యాక్టివ్ గా ఉండటం లేదు. ఉన్న వారు ఎవరూ పట్టించుకోవడం లేదు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లకు ఖర్చులు కూడా వాళ్లే పెట్టుకోవాల్సి వస్తోంది.
బీజేపీలో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు కూడా పైపై సమావేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. యూపీ వ్యహం ప్రకారం స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు అత్యంత కీలకం., రాష్ట్రంలో ఏ మూలన చూసినా బీజేపీ పేరు వినిపించేలా కార్య క్రమాలు రూపొందించి అమలు చేయాలని అనుకున్నారు. ఇవి ముగిిన తర్వాత హైకమాండ్ సమీక్ష సంస్థాగత మార్పులు కూడా చేసే అవకాశం ఉందన్న ప్రచారం తెలంగాణ బీజేపీలో జరుగుతోంది.
ఓ వైపు అంతర్గత సమస్యలు.. మరో వైపు కింది స్థాయి వరకూ లేని క్యాడర్ కారణంగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు ఫెయిలవుతున్నాయి. ఓ వీధిలో సమావేశం పెట్టి పది మందిని కూడా ఆకర్షించలేక.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురి కావాల్సి వస్తోంది.