తెలంగాణ గవర్నర్ నరసింహన్ను.. మార్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని… బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ నిర్మొహమాటంగానే ప్రకటించారు. ఇప్పుడే కాదు.. గతంలోనూ ఆయన అలాగే మాట్లాడారు. ఒక్క లక్ష్మణే కాదు… బీజేపీ నేతలందరిదీ అదే తీరు. ఇప్పుడు…మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి… ఇప్పుడు కచ్చితంగా మార్చేయాల్సిందేనని.. తెలంగాణ బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. ఏపీలోనూ… ప్రభుత్వం మారింది కాబట్టి… రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీలు ఉండవని… రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించాలని.. వారు డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ నేతల ఆగ్రహానికి … గవర్నర్.. టీఆర్ఎస్కు అత్యంత అనుకూలంగా పని చేయడమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతీ సందర్భంలోనూ… ఆయన టీఆర్ఎస్ సర్కార్ను వెనకేసుకు వస్తూ ఉంటారు. అవసరం లేని చోట కూడా.. అదే పనిగా.. పొగుడుతూ ఉంటారు. అదే బీజేపీ నేతలకు ఎంత మాత్రం నచ్చడం లేదు. కొన్నాళ్ల క్రితం.. గవర్నర్ వీసీల సమావేశం నిర్వహించారు. వీసీల పనితీరును గవర్నర్ ప్రశంసించారు. దీనిపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. యూనివర్సిటీల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దాదాపు 70 శాతం పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని గుర్తుచేశారు. కానీ గవర్నర్ మాత్రం ఏం చూసి సంతృప్తి వ్యక్తం చేశారో తనకు అర్థం కావడం మండిపడ్డారు.
ఏపీ బీజేపీ నేతలూ.. గవర్నర్ పనితీరుపై ఏ మాత్రం సంతృప్తిగా లేరు. కొన్నాళ్ల క్రితం ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు … గవర్నర్ గుళ్లూ, గోపురాల చుట్టూ తిరగడానికే తప్ప ఏ పనీ చేయడం లేదని విమర్శలు గుప్పించారు. కారణం లేకుండా.. బీజేపీ నేతలు అకారణంగా.. గవర్నర్ పై కోపం పెంచుకోరన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఆ కారణాలేమిటనేది ఎవరికీ అంతు బట్టడం లేదు. కాంగ్రెస్ హయాంలో గవర్నర్ గా నియమితులైనా… బీజేపీ పెద్దల ప్రాపకం కూడా పొందిన గవర్నర్ వ్యవహారాన్ని ఎవరూ తేలిగ్గా తీసుకోలేరు. గవర్నర్ పై బీజేపీ నేతలే విమర్శలు చేస్తున్నారంటే.. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఢిల్లీ నుంచి జరుగుతోందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.