తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ లో సమావేశమైన కేబినెట్ .. ధరణి పోర్టల్ పై చర్చించి భూమాతగా పేరు మార్చాలని నిర్ణయించింది.
కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం..విధానాల ఖరారుకు మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో సభ్యులుగా పొంగులేటి, దామోదర రాజనర్సింహలు ఉండనున్నారు.
గౌరవల్లి ప్రాజెక్టు పూర్తికి 430 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు..ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబులు ఉండనున్నారు.
మరోవైపు క్రికెటర్ సిరాజ్ , బాక్సర్ నిఖత్ కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని, అలాగే ఇళ్ళ స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఆరోగ్య శాఖలో హెచ్ వోడీ పోస్టుల క్రియేషన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వయనాడ్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు సభలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్.