తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళ్తున్నారు వినాయక చవితి రోజున ఆయన బీహార్‌లో నితీష్ కుమార్‌తో కలిసి రాజకీయాలు చర్చించనున్నారు. అధికారికంగా అయితే ఆయన పర్యటన 2020 జూన్‌లో గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణల్లో అమరులైన బిహార్‌కు చెందిన ఐదుగురు జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిచనున్నారు. అలాగే 0టీవల సికింద్రాబాద్ టింబర్ డిపోలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతిచెందిన 12మంది వలస కూలీల కుటుంబాలను కూడా కేసీఆర్ కలిసి ఆర్థిక సాయం చెక్కులను అందిస్తారు.
ఈ కార్యక్రమంలో నితీష్ కుమార్ కూడా పాల్గొంటారు. ఆ తర్వాత వారు విందు భేటీ నిర్వహిస్తారు. బీహార్‌లో ప్రభుత్వం మారిన వెంటనే కేసీఆర్ పట్నాకు వెళ్లాలనుకున్నారు. కానీ బలపరీక్ష.. ఇతర రాజకీయాల్లో నితీష్ బిజీగా ఉండటంతో కుదరలేదు. ఇప్పుడు వెళ్తున్నారు . ఇటీవలే బీజేపీకి షాకిచ్చి నితీష్ కుమార్ ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మోదీకి ధీటైన ప్రత్యర్థిగా ఆయన ఉంటారని కొంత మంది విశ్లేషిస్తున్నారు.
అదే సమయంలో కేసీఆర్ కూడా బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ గెలవకూడదన్న పట్టుదలతో రాజకీయం చేస్తున్నారు., అందుకే వీలైనంత మందిని కలుపుకుంటున్నారు. బీహార్‌లో ఉన్న ఆర్జేడీ , జేడీయూ రెండూ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. రెండు పార్టీలు కలిస్తే.. బీహార్‌లో ఏకపక్ష ఫలితాలు వస్తాయన్న అంచనాలు దీంతో కేసీఆర్.. గట్టి ప్లానే వేశారని అంటున్నారు. అయితే కేసీఆర్ కలిసి వచ్చిన ప్రభుత్వాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో ?