తెలంగాణలో కౌంటింగ్‌కు ముదే రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మజ్లిస్‌ను దూరం పెడితే.. తామే ప్రభుత్వానికి మద్దతిస్తామని.. భారతీయ జనతా పార్టీ కేసీఆర్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గుంభనంగా.. ఓవైసీ బ్రదర్స్‌తో టచ్‌లోకి వెళ్లింది. టీఆర్ఎస్ విషయంలో మజ్లిస్‌కు మొదటి నుంచి కాస్త సందేహం ఉంది. తెలంగాణలో ముస్లింల ఓట్ల కోసం.. తమతో స్నేహం నటిస్తున్నా.. జాతీయ స్తాయి ప్రయోజనాల కోసం.. కేసీఆర్ కచ్చితంగా బీజేపీతోనే వెళ్తారన్న క్లారిటీ ఓవైసీ బ్రదర్స్‌కు ఉంది. అందుకే సిట్టింగ్ సీట్ల విషయంలో టీఆర్ఎస్ సహకారం ఉంటే చాలనుకుని.. వాటికే ఫిక్సయిపోయింది. ఇప్పుడు హంగ్ వచ్చే పరిస్థితి ఏర్పడటంతో.. ఓవైసీ బ్రదర్స్ కీలకం అవుతారన్న అంచనాల నేపధ్యంలో.. కాంగ్రెస్ పార్టీ.. కౌంటింగ్‌కు ముందుగానే చర్చలు ప్రారంభించింది. ఈ ప్రతిపాదనలను ఓవైసీ ఖండించడం లేదు. ఇప్పుడేమీ స్పందించబోనని అంటున్నారు.
నిజానికి ఓవైసీ బ్రదర్స్‌లో పెద్దవాడైన అసదుద్దీన్.. టీఆర్ఎస్కు పూర్తి స్థాయిలో సహకరించారు. ఆయన జిల్లాల్లో కూడా… టీఆర్ఎస్కు ఓటు వేయాలని ప్రచారం చేశారు. కానీ అక్బరుద్దీన్ మాత్రం.. అన్న మాటలను అసలు పరిగణనలోకి తీసుకోలేదు. డిసెంబర్ పదకొండో తేదీన బాద్ షా అవుతానని లేదా బాద్ షా మేకర్‌ను అవుతానని.. పదే పదే ప్రకటలు చేశారు. కేసీఆర్ కాదు.. కదా.. ఏ సీఎం అయినా సరే తమ ముందు తల వంచాల్సిందేనని ప్రకటనలు చేశారు. దీంతో.. ఓవైసీ బ్రదర్స్ చెరో వాయిస్ వినిపిస్తున్నారంటే.. కచ్చితంగా… వాళ్లు ఎన్నికల తర్వాత ఏదో మ్యాజిక్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది.
ఓవైసీ బ్రదర్స్ రాజకీయంలో.. ఎప్పుడూ ఒకరికి స్టిక్ అయిన సందర్భాలు లేవు. ఎవరు తమకు ఆర్థికంగా, రాజకీయంగా సహకరిస్తారో.. వారికే మద్దతుగా నిలుస్తారు. అధికారంలో ఎవరు ఉంటే వారితో సన్నిహితంగా మెలిగి.. ఇతర చోట్ల అధికారంలో ఉన్న పార్టీలకు ముస్లిం ఓట్లు వచ్చేలా చేస్తామని అప్రకటిత ఒప్పందం చేసుకుని.. ఇంకెవరూ పాతబస్తీలోకి రాకుండా చూసుకుంటూ ఉంటారు., బీజేపీ సపోర్ట్ ఉన్న ప్రభుత్వానికి ఓవైసీ ఎలా సమర్థించినా.. అది ఆ పార్టీ బేస్కే దెబ్బ పడుతుంది. ప్రత్యామ్నాయం ఎవరు వచ్చినా.. మజ్లిస్ కనుమరుగవుతుంది. అందుకే.. బీజేపీ కన్నా.. కాంగ్రెస్ బెటర్ అనుకునే పరిస్తితి ఓవైసీలకు రావొచ్చు. ఏం జరుగుతుందనేది.. కౌంటింగ్ తర్వాత క్లారిటీ వస్తుంది.