హైదరాబాద్లో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో తెలంగాణ మేనిఫెస్టోపై ఓ నిర్ణయం ప్రకటించబోతున్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా కర్నాటకలోని గృహలక్ష్మీ పథకం తరహాలో ఇక్కడ ‘మహాలక్ష్మీ’ పేరుతో అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కర్నాటకలో మహిళలకు ప్రతి నెల రూ.2 వేలు ఇస్తుండగా, ఇక్కడ రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక గ్యారంటీల్లో రూ.2 లక్షల రైతు రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు, అభయహస్తం పేరుతో దళితులు, గిరిజనులకు రూ.12 లక్షల సాయం , చేయూతపేరుతో రూ.4 వేల పింఛన్ ఉండనున్నట్టు తెలుస్తున్నది. మరో గ్యారంటీని ఓబీసీలకు సంబంధించి ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రెండో రోజు సీడబ్ల్యూసీ సమావేశాలు పూర్తయిన తర్వతా ర్యాలీగా ‘విజయభేరి’ సభ నిర్వహించనున్న తుక్కుగూడకు వెళ్తారు. అక్కడే హామీలను ప్రకటిస్తారు. ఆ వెంటనే నేతలంతా నియోజవర్గాలకు వెళ్తారు. పీసీసీ చీఫ్ సహా అందరూ.. 18న ఇంటింటికీ తిరిగి గ్యారంటీ కార్డులు, చార్జ్ షీట్ ను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర సర్కార్ చేస్తున్న అవినీతిపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్లో దానిపై చర్చించి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన వ్యూహాలపై సోనియా, ఖర్గే దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు.
తెలంగాణ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్లులు, సీఎల్పీ నేతలతో హైకమాండ్ చర్చించనుంది. తెలంగాణలో పాజిటివ్ వాతావరణం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపుకోసం.. ప్రయత్నించేలా .. ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ కొనసాగిస్తున్నారు. సమన్వయం పెంచుకునేలా అన్ని సహన్నాహాలు చేసుకుంటున్నారు.