కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వీడియోలను తొలగించాలని సోషల్ మీడియా సంస్థలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అలాంటి మాటలు మాట్లావద్దని గట్టిగా హెచ్చరించారు. అదే సమయంలో ఆ వీడియోలన్నింటినీ సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయా సంస్థలకు ఉత్తర్వులు ఇచ్చారు.
తదుపరి విచారణను నవంబర్ పదకొండో తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ అంశంపై నాగార్జున కుటుంబం కోర్టును ఆశ్రయించింది. ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చారు. అయితే ఆయన పిటిషన్ విషయంలో కోర్టు ఇంకా ఇలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అయితే ఒకే వీడియోలో అందర్నీ కలిపి విమర్శించారు కాబట్టి ఆ వీడియోలన్నీ తీసేస్తే.. నాగార్జున కూడా ఊరట లభించినట్లవుతుంది.
కేటీఆర్ కొండా సురేఖపై వంద కోట్ల పరువు నష్టం దాఖలు చేశారు. ఈ విషయంలో తను ఓలక్ష్మణ రేఖను గీస్తానని ఆయన అంటున్నారు. బండి సంజయ్‌కూ నోటీసులు పంపించారు. రాజకీయాల్ల ోవ్యక్తిగత విమర్శలు లేకుండా తాను పోరాడతానని చెబుతున్నారు.