పవన్ కల్యాణ్ లడ్డూలపై చేసిన వ్యాఖ్యల వల్ల హిందువుల మనోిభావాలు దెబ్బతిన్నాయంటూ ఓ లాయర్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు విచారణ జరిపి పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తి అయోధ్య రామాలయంలో రాముడి పున ప్రతిష్టకు కల్తీ లడ్డూలు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ వ్యక్తి పిటిషన్ లో పేర్కొన్నారు. కోర్టు పవన్ కళ్యాణ్ తో పాటు తెలంగాణ సీఎస్ కు కూడా సమన్లు జారీ చేసింది.
తిరుమల లడ్డూ విషయంపై పవన్ చేసిన వ్యాఖ్యల వీడియోలను సోషల్ మీడియా నుంచి, మీడియా చానల్స్ నుంచి తొలగించేలా ఆదేశివ్వాలని పిటిషనర్ రామారావు కోర్టును కోరారు. పవన్ కల్యాణ్ లాంటి సెలబ్రిటీ, డిప్యూటీ సీఎంపై కోర్టులో పిటిషన్లు వేస్తే పబ్లిసిటీ వస్తుందని చాలా మంది లాయర్లు అదే పని చేస్తూంటారు. లక్కీగా కోర్టు అందులో మెరిట్ ఉందని భావించి నోటీసులో..సమన్లో ఇస్తే వచ్చే పబ్లిసిటీ గురించి చెప్పాల్సిన పని లేదు. మీడియా తీరికగా ఉంటే ఆ లాయర్ పంట పండినట్లే. టీవీల్లో ఆయనే కనిపిస్తారు.
అయితే అసలు ఈ మనోభావాలు అనే కాన్సెప్టే కోర్టులో నిలబడదని అనేక కేసులు రుజువు చేశాయి. పవన్ కల్యాణ్ పూర్తిగా లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై మాత్రమే మాట్లాడారు. రికార్డుల్లో ఉన్నదే మాట్లాడారు. దానికో మనోబావాలు అని చెప్పి పిటిషన్ వేయడం వెనుక లాయర్ కు అంతర్గత అజెండా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్ లీగల్ టీమ్ ఈ ఆదేశాలను పరిశీలించిన తర్వాత పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.