తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్‌కు హైకోర్టులో భారీ ఎదురు దెబ్బతగిలింది. ఆయనను ఏపీ కేడర్‌కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ట్రైబ్యునల్ ఆదేశాలను కొనసాగిస్తూ సోమేష్‌కుమార్ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అధికారుల విభజన జరిగింది. ఈ సందర్భంగా సోమేష్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడం ఇష్టం లేని సోమేష్ కుమార్ తనను తెలంగాణకే కేటాయించాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ క్యాట్‌లో పిటిషన్ వేశారు.
తన కేటాయింపు అనైతికమని.. ఆయన వాదించారు. చాలా సంవత్సరాల విచారణ తర్వాత ఆయన్ని ఏపీకి వెళ్లాల్సిందేనంటూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ 2017లో మళ్లీ ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. సోమేష్ కుమార్ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో కూడా ఇన్నేళ్లు విచారణ కొనసాగింది. ఇప్పుడు తీర్పును వెల్లడించింది. దీంతో ఆయనకు గట్టి షాక్ తగిలినట్లయింది.
ప్రస్తుతం తెలంగాణ సీఎస్‌గా ఉన్న సోమేష్ కుమార్ మరో ఏడాదిలో రిటైర్ కాబోతున్నారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తారా లేకుంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఒక వేళ అప్పీల్‌కు వెళ్లి స్టే తెచ్చుకుంటే ఆయన పదవి నిలబడుతుంది. స్టే తెచ్చుకోకపోతే మాత్రం ఆయన సీఎస్ పదవి నుంచి వైదొలగక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదే జరిగితే.. తెలంగాణకు కొత్త చీఫ్ సెక్రటరీ వస్తారు.