ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒకదాన్ని నెరవేర్చడానికి తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఆ హామీ.. ఏపీలో ఉండిపోయిన తెలంగాణ ఉద్యోగుల్ని మళ్లీ వెనక్కి రప్పించడం. తెలంగాణ స్థానికత ఉండి.. విభజన సమయలో తెలంగాణ ఆప్షన్ పెట్టుకున్న కనీసం వెయ్యి మంది ఉద్యోగులు.. ఏపీకి అలాట్ అయ్యారు. దాంతో వారు ఏపీలో వారు విధుల్లో చేరాల్సి వచ్చింది. ప్రస్తుంత అలాంటి వారు 698 మంది ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు .. వారందర్నీ తెలంగాణకు పంపించాలని కోరుతూ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా లేఖ పంపారు. దీనిపై ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ ఉద్యోగులంతా క్లాస్ త్రీ, క్లాస్ ఫోర్ ఉద్యోగులే. కాబట్టి… పంపడానికి ఏపీ సర్కార్కు కూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. నిజానికి తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఉద్యోగ సంఘాలు ..ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగుల్ని తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నాయి. మొదట్లో… ఎప్పుడు సమావేశం జరిగినా..ఆ డిమాండ్ వినిపించారు. ఉద్యోగ సంఘాలు నిర్వీర్యం అయిపోయాక.. అడగడం మావేశారు. తమ కోసం మాట్లాడేవారు లేకపోవడంతో.. ఏపీలోని కింది స్థాయి ఉద్యోగులు కూడా సైలెంటయిపోయారు. గత ఎన్నికల సందర్భంగా కూడా ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. అప్పుడు కూడా కేసీఆర్.. తీసుకు వస్తామని హామీ ఇచ్చారు.
మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఉద్యోగుల ఓట్లు కీలకం కావడంతో… హామీని ఉద్యోగ సంఘాలు తెరపైకి తెచ్చాయి. దానికి కేసీఆర్ అంగీకరించారు. ఎన్నికలు ముగియగానే ఏపీ సర్కార్ కు లేఖ రాశారు. అయితే.. నామ మాత్రంగా లేఖ రాసి.. సరిపెడతారా.. ఉద్యోగులందర్నీ తీసుకొచ్చేదాకా ప్రయత్నిస్తారా అన్నది ముందు ముందు తేలనుంది