కలెక్టర్ పై దాడికి కారణమైన కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రబుత్వం రద్దు చేసింది. అక్కడ పెడుతున్నది ఫార్మా పరిశ్రమ అని ప్రచారం కావడం.. భూసేకరణ నోటిఫికేషన్లోనూ అలాగే ఉండటంతో అక్కడి ప్రజల్లో కాలుష్య భయం ఏర్పడింది. ఈ కారణంగా మరింత ఎక్కువ మంది తమ భూములు ఇచ్చేది లేదంటున్నారు. దీంతో ప్రభుత్వం అన్ని వర్గాలతో మాట్లాడి లగచర్ల భూ నోటిఫికేషన్ ను రద్దు చేయాలని నిర్ణయించారు.
అయితే అక్కడి ప్రజలు ఎక్కువ మంది తమ ప్రాంతానికి ఉపాధి అవకాశాలు రావాలని కోరుకుటున్నారు. ఫార్మా కాకుండా ఇతర పరిశ్రమలకు భూములిస్తామని చెబుతున్నారరు. నిజానికి అక్కడ భూసేకరణ చేయాలనుకున్న ప్రాంతంలో నీటి సౌకర్యం లేని భూములే ఎక్కువ ఉన్నాయి. తమ పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తే భూములిస్తామని అంటున్నారు. దీంతో ఇండస్ట్రియర్ కారిడార్ కోసం భూములు సేకరించేందుకు ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేశారు. మల్లీ ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌పై గత ఐదారు నెలలుగా బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్లి రైతుల్ని రెచ్చగొట్టారు. ఫలితంగా లగచర్ల లాంటి ఘటన జరిగింది. ఈ విషయంలో మొండిగా ముందుకెళ్తే వచ్చేది ఎంత పెద్ద పరిశ్రమ అయినా సమస్యలే కాబట్టి.. వ్యూహాత్మకంగా నోటిఫికేషన్ రద్దు చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూసేకరణ చేయనున్నారు.