రైతు బంధు పథకానికి నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ అడ్డుకుందని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మొదట్లో తీవ్ర విమర్శలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది. రైతు బంధుకు నిధులు ఇస్తామని ఇలా అడగగానే అలా ఈసీ అనుమతి ఇచ్చింది. పోలింగ్ కు ముందు ఇలాంటి అవకాశం ఇవ్వడంతో ఈ మాత్రం చాలదా అని అప్పటికప్పుడు రైతు బంధు లబ్దిదారుల ఖాతాల్లోని నగదు జమ చేసేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది.
శరవేగంగా ఈసీ నుంచి అనుమతి
తెలంగాణ సర్కార్ వద్ద నిధుల్లేకపోవడంతో కొన్ని పథకాలు అమలు చేయకుండానే ఎన్నికలకు వెళ్లిపోయారు. అయితే ఆ పథకాల సొమ్ముల కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. వాటిలో రుణమాఫీ కూడా ఉంది. కానీ రుణమాఫీ చేసే పరిస్థితి లేదు. ఎక్కువ మంది ఖాతాల్లో డబ్బులు జమ చేయాలంటే రైతుబంధునే కరెక్ట్ అనుకుని నెలాఖరులో డబ్బులు సమకూరుతాయి కాబట్టి వెంటనే రైతు బంధు ఇచ్చేందుకు దరఖాస్తు చేశారు. ఇలా దరఖాస్తు చేయగానే అలా అనుమతి ఇచ్చేసింది.
28లోపు డబ్బులు జమ చేయాలనన ఈసీ
రైతు బంధు నగదును రైతుల ఖాతాల్లో 28లోపు జమ చేయాలని ఈసీ ఆదేశిచింది. ఆ తర్వాత వద్దని స్పష్టం చేసింది. అంటే అప్పటికి ప్రచార గడువు పూర్తవుతుంది కాబట్టి.. పోలింగ్ ముందు రోజు జమ చేయవద్దని తెలిపింది. ఒక్క రోజు ముందు అయినా.. మూడు రోజులు ముందు అయినా పెద్ద తేడా ఏముంటుంది అని.. బీఆర్ఎస్ అడ్వాంటేజ్ గా తీసుకుంది. గత ఎన్నికలకు ముందు కూడా ఇలాగే చెక్కులు పంపిణీ చేసి విజయం సాధించింది.
ఈసీ షాక్ – పాపం కాంగ్రెస్
ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ఎవరికైనా ప్రభుత్వం డబ్బులు జమ చేయాలనుకుంటే.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందే పూర్తి చేయించాలని.. ఆ తర్వాత వద్దని కాంగ్రెస్ పార్టీ ముందే ఫిర్యాదు చేసింది. కానీ ఈసీ పట్టించుకోలేదు. పోలింగ్ కు ఐదు రోజుల ముందు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేసే అవకాశాన్ని కల్పించింది. అవేమీ జీతాలు కాదని పోలింగ్ అయిన తర్వాత ఒకటో తేదీన పంపిణీ చేసినా నష్టమేమిటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. గతంలో జనవరిలో కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయంటున్నారు.
ఎవరేమి అన్నా… మొత్తగా బీఆర్ఎస్కు గోల్డెన్ చాన్స్ వచ్చింది. లబ్దిదారుల ఖాతాల్లో దాదాపుగా ఏడు వేల కోట్లకుపైగా జమ చేసే చాన్స్ వచ్చింది. ఖచ్చితంగా ఎన్నికలల్లో కలసి వచ్చే అంశమే అవుతుందని అనుకోవచ్చు.