ఉహాగానాలకు తెరపడింది. సస్పెన్స్‌కు కేసీఆర్ క్లైమాక్స్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ… మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి.. వెంటనే దాన్ని తీసుకెళ్లి గవర్నర్‌కు సమర్పించారు. ముహుర్తం ప్రకారం..మంత్రివర్గ సమావేశాన్ని జరిపిన కేసీఆర్.. నాలుగున్నర నిమిషాల్లోనే భేటీ ముగించారు. ఆ తర్వాత నేరుగా.. రాజ్‌భవన్‌కు వెళ్లి… గవర్నర్‌కు అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని అందించారు. ఇదంతా లాంఛనమైన ప్రక్రియ. అసెంబ్లీ రద్దుకు సంబంధించిన మరో తీర్మానం కాపీ .. స్పీకర్ ధృవీకరణతో గవర్నర్‌కు అందుతుంది. అందిన వెంటనే.. గవర్నర్ ఆమోద ముద్రవేస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ రద్దు అయినట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆ తర్వాత ఎన్నికల సంఘం తన పని ప్రారంభిస్తుంది. అసెంబ్లీ ర్దుద చేసినా.. ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్ కొనసాగుతారు.
ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని కూడా శ్రావణమాసం చివరి శుక్రవారం రోజున అంటే రేపే ప్రారంభించబోతున్నారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభతో ఎన్నికల సమరానికి టీఆర్ఎస్ అధినేత శంఖారావం పూరించనున్నారు.ఇవాళ సాయంత్రం కేసీఆర్ గజ్వేల్‌కు చేరుకోనున్నారు. రేపు కోనాయపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత హుస్నాబాద్ బహిరంగ సభతో ప్రచారం ప్రారంభిస్తారు. జూన్ 2, 2014న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 4సంవత్సరాల 3నెలల 4రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పూర్తి మెజార్టీ ఉన్నా.. ప్రభుత్వానికి ఏ ఢోకా లేకున్నా.. తెలంగాణ తొలి ప్రభుత్వం… తొమ్మిది నెలల ముందుగానే రద్దు అయింది.
కాంగ్రెస్ కూడా ముందసతు కోసం… సన్నాహాలు ప్రారంభించింది. నిన్ననే కీలకమైన హామీలను ప్రకటించిన కాంగ్రెస్ నేతలు.. తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్లిన పీసీసీ ముఖ్యనేతలు తెలంగాణలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, టీఆర్ఎస్ను ఎదుర్కునేందుకు సిద్ధం చేసుకోవాల్సిన అంశాలపై హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నారు. ది. సెప్టెంబర్ 8న చంద్రబాబు టీ టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే వారంలోనే అమిత్ షా, సోనియా గాంధీలు వారి వారి పార్టీల తరపున బహిరంగసభలు నిర్వహించబోతున్నారు.