విద్యాసంవత్సరాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైన తెలంగాణ సర్కార్.. బ్యాక్ లాగ్స్ ఉంచుకోకుండా జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే టెస్త్, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారు. ఇప్పుడు.. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతాయేమోననే ఆందోళన మధ్య ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించారు.
ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు తెలంగాణలో 4 లక్షల73 వేల మంది ఉన్నారు. వీరిలో లక్షా 99 వేల మంది బ్యాక్ లాగ్ విద్యార్థులు ఉన్నారు. వీరిని ఇప్పటికే కనీస మార్కులతో పాస్ చేశారు. అదే తరహాలో ఇప్పుడు కూడా కనీస మార్కులు- అంటే 45 మార్కులలోపు వచ్చిన వారికి 45 మార్కులు వేస్తారు. నిరుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మెరిట్ సాధించిన విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్లో మార్కులు కేటాయించనున్నారు.
ప్రాక్టికల్ మార్కులను మాత్రం గరిష్టంగా అందరికీ వేస్తారు. బైపీసీ విద్యార్థులకు నాలుగు సబ్జెక్టుల్లో 120 మార్కులు, ఎంపీసీ విద్యార్థులకు రెండు సబ్జెక్టుల్లో 60 మార్కులు వేసి పాస్ చేయనున్నారు. ఇంటర్నల్, ప్రాక్టికల్ మార్కుల ఆధారంగా మార్కులు వేస్తారు. విద్యార్థుల భవిష్యత్ కోసం.. ప్రభుత్వం చకచకా నిర్ణయాలు తీసుకోవడం.. విద్యార్థుల తల్లిదండ్రులకు టెన్షన్ లేకుండా చేస్తోంది.