తెలంగాణ ప్రభుత్వంం అవమానాలకు గురి చేస్తూండటంతో తాడో పేడో తేల్చుకోవాలని డిసైడయిన గవర్నర్ తమిళిసై డ్రగ్స్ కేసుతోనే ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో డ్రగ్స్ చాలా సీరియస్ ఇష్యూలా మారిందని పూర్తి స్థాయి నివేదికను అమిత్ షాకు అందించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో డ్రగ్స్ కేసుల్లో సెలక్టివ్‌గా దాడులు చేస్తున్నారని.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ పిల్లలకు చాలా ప్రమాదకరమైనవని.. ఓ తల్లిగా బాధపడుతూ ఈ విషయం చెబుతున్నానన్నారు. అలాగే తెలంగాణలో అవినీతి ఇతర అంశాలను కూడా నివేదికలో గవర్నర్ ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. అదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ డ్రగ్స్ కేసును విచారణ చేయడానికి ముందుకు వచ్చినా ఆధారాలు ఇవ్వడం లేదు. దీనిపై తెలంగాణ ఉన్నతాధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఈడీ పిటిషన్ కూడా వేసింది. అయినప్పటికీ అధికారులు సాక్ష్యాలు ఇవ్వలేదు. గురువారమే కోర్టు సీఎస్‌తోపాటు ఎక్సైజ్ శాఖ డైరక్టర్‌కు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇలాంటి తరుణంలో గవర్నర్ డ్రగ్స్ కేసు గురించి కూడా కేంద్రానికి నివేదిక ఇవ్వడం కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఢిల్లీలో గవర్నర్ చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గవర్నర్‌తో తమకు ఎలాంటి పంచాయతీ లేదని ఆయన స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ప్రతిపాదనకు ఆమోదం చెప్పలేదని .. ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్ అంటున్నారని.. గత గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు తమకు ఎప్పుడూ ఇబ్బందులు ఎదురు కాలేదని కేటీఆర్ గుర్తు చేశారు. గవర్నర్ ఏదేదో ఊహించుకుని మాట్లాడుతూంటే తాము ఏం చేయగలమని కేటీఆర్ ప్రశ్నించారు.