ఓ ప్రభుత్వ డేటా చోరీ అయితే.. పక్క రాష్ట్ర ప్రభుత్వంపై కేసు పెడతానంటోంది.. “నిజాం రాజ్యంగం..!”
ఆ రాజ్యంలో సామంతులుగా ఉండే వాళ్లతో కుమ్మక్కయి.. వారికి చెందిన వారితోనే కేసులు తీసుకుని ఏపీపై పగ తీర్చుకుంటోంది “నిజాం రాజ్యాంగం..!”
అసలు కేసేమిటో తెలియకుండానే… సమాచారం లీక్ అని.. ఓట్లు తీసేశారని.. సర్వేలు చేశారని కబుర్లు చెబుతోంది.. “నిజాం రాజ్యాంగం..!”
ఓ వైపు జయరాం లాంటి అమెరికన్లను కిడ్నాప్ చేసి.. చంపేసి.. వాటిని వీడియోలుగా తీసి.. పోలీసులతోనే.. ఎలా కేసును మాఫీ చేయాలన్న ఐడియాలు పొందిన క్రమినల్స్… హాయిగా ఉంటే… లేని రాజకీయ కోసం తొమ్మిది మంది సీనియర్ అధికారులతో సిట్ వేసింది “నిజాం రాజ్యాంగం..!”
కోర్టులు చెంపదెబ్బ కొట్టినా చేసినంత దుష్ప్రచారం చేయాల్సిందేనా..?
సైబరాబాద్ కమిషనర్ ఏం చెప్పారు..? ప్రభుత్వ అధికారిక సమాచారం… సేవామిత్ర యాప్లో ఉందని చెప్పారు. ఓటర్ల జాబితా ఎడిట్ చేస్తున్నారని చెప్పారు. ఓట్లు తీసేస్తున్నారని చెప్పారు. దీనిపైన ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. పబ్లిక్ డొమైన్లో ఉన్నది తప్పా.. ఏ ఏపీ ప్రభుత్వ సమాచారం బయటకు పోలేదని తేల్చారు. ఆసలు దొంగతనమే జరగలేదని… ఆ ఆస్తిదారుడు చెప్పిన తర్వాత ఆ పోలీసులు సిగ్గుపడాల్సింది పోయి… మరో ఫిర్యాదుదారుడితో ఫిర్యాదు చేయించుకున్నారు. దాని మీద.. ప్రెస్ మీట్ పెట్టి.. ఎక్కడో జార్జియాలో జరిగిందని.. ఫిర్యాదు దారు ఫిర్యాదు చేశాడని.. కేసు తీసుకున్నామని చెబుతున్నారు. చివరికి అసలు కేసేమిటంటే.. ఓట్లు తీసేస్తున్నారని చెబుతున్నారు. అలా.. యాప్ నుంచి ఓట్లు తీసేయడం సాధ్యం కాదని.. ఈసీని ఒక్క మాట అడిగితే అధికారికంగా చెబుతుంది కదా…!
విచారణ పేరుతో.. ఏపీలో గందరగోళం సృష్టించడమే నిజాం రాజ్యంగం లక్ష్యం..!
నిజాం రాజ్యాంగంలో కీలకమైన అంశం ఏమిటంటే.. ఎవరైతే రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారో.. ఎవరినైతే టార్గెట్ చేసుకున్నారో వారిపై పోలీసుల్ని ప్రయోగించడం. వారి ఇళ్లలో రెండు, మూడు రోజులు రెస్ట్ తీసుకోవడం. ఆ మూడు రోజుల పాటు మీడియాలో.. అవి దొరికాయి.. ఇవి దొరికాయని… ప్రచారం చేయడం. ఆ తర్వాత సైలెంటయిపోవడం. అటవీ సంపద పేరుతో.. కొత్త చట్టం తెస్తామని బెదిరించి.. అందులో లొసుగులున్న వారిని బెదిరించి.. ఇప్పటికే ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చేసుకున్నారు. మరో ఎమ్మెల్యేనీ అదే పద్దతిలో చేర్చుకున్నారు. రేవంత్ రెడ్డి ఇష్యూలో అదే జరిగింది. ఇప్పుడు అదే… ఏపీ ప్రభుత్వంపైనా చేస్తున్నారు. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు… పెట్టీ కేసుల్ని అడ్డం పెట్టుకుని.. తెలంగాణలో తమకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ బెదిరించడం… నిజాం రాజ్యాంగంలో కీలకంగా మారిపోయింది.
దేశ రాజ్యాంగాన్ని ఇక మర్చిపోవచ్చు..!
ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా రాజ్యాంగం లేదు. ఎంత రాజకీయ వైరుధ్యమున్న అది రాజకీయంగానే చేసుకుంటారు. కానీ.. సంబంధం లేని విషయాల్లో కొత్త రాజ్యాంగం రాసుకుని మరీ.. తెగబడే… వైపరీత్యం లేదు. ప్రజల్ని నోరెత్తనీయకుండా చేసి.. అందర్నీ బెదిరించి ఎంత కాలం అని .. కాలం గడుపుతారు. రాజకీయం రోజు రోజుకు కొత్త రూపు మారిపోతోంది. ఎవరి చేతికి అధికారం రాకూడదో.. వారి చేతికే వస్తోంది. అది వికృతరూపానికి దారి తీస్తోంది. దేశ రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకోకుండా.. సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు….