తెలంగాణలో ఎవరైనా సరే మాస్క్‌తో కనిపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉంది. జనం ఎవరూ బయటకు రావడం లేదు. నిత్యావసర వస్తువుల కోసం.. ఇతర అవసరాల కోసం.. కొంత మంది జనం రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. వారెవరూ.. మాస్కుల్లాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. వైరస్ సామాజిక వ్యాప్తి జరుగుతోందని… వైరస్ సోకినా లక్షణాలు బయటపడటం లేదన్న విషయ ఇప్పుడిప్పుడు బయటకు వస్తూండటంతో.. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి మాస్కులు తప్పని సరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే పలు రాష్ట్రాలు.. మాస్కులు లేనిదే రోడ్డు పైకి రావద్దని ఆదేశాలు జారీ చేశాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. మాస్క్ లేకుండా రోడ్డుపైకి వస్తే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని కూడా ప్రకటించింది. ఇప్పుడు తెలంగామ సర్కార్ కూడా.. మాస్క్ లు తప్పనిసరి చేసింది. మాస్క్‌లు లేకుండా బయటకు వస్తే.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే.. మాస్కుల కొరత తీవ్రంగా ఉంది. సర్జికల్ మాస్కులే కాదు.. క్లాత్ మాస్కులు కూడా.. మార్కెట్లో దొరకని పరిస్థితి ఉంది.
మాస్కులు ఒక్క సారి కొంటే సరిపోయేది కాదు.. రెగ్యూలర్ గా వాటిని కొంటూనే ఉండాలి. వాటిని రీ యూజ్ చేయడానికి అవకాశం లేదు. కొరత ఉన్న సమయంలో.. మాస్క్‌లు తప్పని సరి చేయడం ఇబ్బందికరమే. అయినప్పటికీ.. ప్రజలు కర్చిఫ్లు లాంటి వాటిని మాస్క్‌లుగా మార్చుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సామాజిక దూరంతో పాటు.. ఇప్పుడు మాస్కులు కూడా.. కీలక పోరాట ఆయుధంగా మారుతున్నాయి.