గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా ముందుకు వెళ్తోన్న హైడ్రాకు రేవంత్ సర్కార్ మరో కీలక బాధ్యతను అప్పగించబోతుందా?అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఎఫ్ టీ ఎల్ , బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తోంది. నిబంధనలకు విరుద్దంగా ఉన్న భవనాలను వరుసగా కూల్చివేస్తూ.. అక్రమార్కులకు దడ పుట్టిస్తోంది. హైడ్రా పనితీరుపై విమర్శలు ఎలా ఉన్నా.. ప్రశంసలు కూడా వస్తుండటంతో రేవంత్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
భవన నిర్మాణాలకు సంబంధించి సర్కార్ మంజూరు చేసే అనుమతుల ప్రక్రియలోనూ హైడ్రాను చేర్చే విషయమై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోందని తెలుస్తోంది. ఈ విషయంలో హైడ్రాను కూడా భాగస్వామ్యం చేస్తే ఎలా ఉంటుంది? అనే అంశంపై సర్కార్ చర్చించినట్లుగా సమాచారం.
భవనాలకు అనుమతులు ఇచ్చే విషయంలో హైడ్రా పర్మిషన్స్ కూడా ఉండాలని సర్కార్ నిర్ణయిస్తే.. ఇక నుంచి నగరంలో ఎవరైనా నిర్మాణాలు చేపడితే హైడ్రా నుంచి తప్పక ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.