కొత్త భవనాలు కట్టేయాలని ఆశ పడుతున్న తెలంగాణ సర్కార్ కు పరిస్థితులు ఏ మాత్రం కలసి రావడం లేదు. ఎర్రమంజిల్లో ఉన్న పాత భవనాన్ని కూల్చేసి.. అక్కడ అసెంబ్లీ కట్టాలన్న నిర్ణయంపై.. హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై… జరుగుతున్న విచారణలో ప్రభుత్వం… సంతృప్తికరమైన సమాధానాలు చెప్పలేకపోతోంది. ఫలితంగా.. హైకోర్టు ధర్మానసం కూల్చివేతగా వ్యతిరేకంగా కీలక మైన వ్యాఖ్యలు చేస్తోంది. ఉన్న అసెంబ్లీని కాదని కొత్త భవనం ఎందుకని నేటి నిచారణలో హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రస్తుత అసెంబ్లీలో అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా అని ఆరా తీసింది. ఎర్రమంజిల్ భవనం కూల్చివేతకు.. హెచ్ఎండీఏ అనుమతి తీసుకున్నారా.. లేదో చెప్పడానికి… ప్రభుత్వ న్యాయవాది సంశయించారు. గతంలోనూ.. ఇదే అంశంపై సమాచారం… కోర్టుకు ప్రభుత్వం ఇవ్వలేకపోయింది.
హెచ్ఎండీఏ అనుమతి ఉందా లేదా అన్న విషయం చెప్పడానికి.. ఇంత ఆలస్యం ఎందుకని హైకోర్టు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. వాస్తవపరిస్థితిపై గురువారం వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఎర్రమంజిల్ భవనం పురావస్తు పరిధిలోకి వస్తుంది. వంద ఏళ్లు నిండిన భవనాన్ని కూల్చివేయడం కరెక్ట్ కాదని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. చివరికి నిజాం వారసులు కూడా.. ఈ పిటిషన్ల పోరాటంలో పాల్గొన్నారు. వారు కూడా.. భవనాన్ని కూల్చవద్దని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం.. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి వేసి.. కొత్తగా అసెంబ్లీని కట్టాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే.. అక్కడ శంకుస్థాపన కూడా చేశారు.
ఇప్పుడు… ఎర్రమంజిల్ భవనం కూల్చివేతకు వ్యతిరేకంగా.. విచారణలో న్యాయస్థానం కామెంట్లు చేస్తూండటంతో… ప్రబుత్వానికి టెన్షన్ ప్రారంభమయింది. అదే సమంయలో.. సెక్రటేరియట్ కట్టాలనుకుంటున్న … చోట కూడా.. పరిస్థితి అలాగే ఉంది. రేవంత్ రెడ్డి సహాలు.. పలువురు నేతలు… పాత సెక్రటేరియట్ కూల్చివేతకు వ్యతిరేకంగా పిటిషన్లు వేశారు. వీటిపై బీజేపీ నేతలు కూడా.. తీవ్ర స్థాయిలో పోరాడుతున్నారు. మొత్తానికి.. కొత్త సచివాలయాలు కట్టాలనే.. కేసీఆర్ లక్ష్యానికి… అనేక అడ్డంకులు ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది.