గ్రూప్ 1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. నియామక ప్రక్రియపై విచారణ ముగిసే వరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటీషన్లపై విచారణ జరిపిన హైకోర్టు నియామకాలకు బ్రేక్ లు వేసింది. అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించి, నియామక పత్రాలను పెండింగ్ లో పెంచాలని స్పష్టం చేసింది. ఇటీవలే ఫలితాలు వెలువడటంతో అర్హత సాధించిన అభ్యర్థులు, ఉద్యోగంలో చేరిపోదామని ఆనందపడుతోన్న సమయంలో హైకోర్టు తాజా ఆదేశాలు వారిని షాక్ కు గురి చేస్తున్నాయి.
గ్రూప్-1 ఫలితాలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. రెండు సెంటర్లలోనే 74 మందికి ర్యాంకులు వచ్చాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందన్నారు. పరీక్షల్ని రద్దు చేసి సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మాత్రం ఎలాంటి అక్రమాలు జరగలేదని బీఆర్ఎస్ నేతల ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో నియామకాలకు బ్రేకులు పడ్డాయి.