ఓఎంసీ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ప్రకటించింది. కేసు నమోదైన తర్వాత కేసు విచారణల్లో మెరిట్స్‌లో ఎప్పుడూ ఆమెకు ఊరట దక్కలేదు. క్వాష్ పిటిషన్లు సహా ఏ విషయంలోనూ ఆమెకు ఊరట దక్కలేదు. చివరికి.. గాలి జనార్ధన్ రెడ్డి కేసుల్లో రోజువారీ విచారణ ప్రారంభమైన దశలో ఆమెకు క్లీన్ చిట్ లభించింది. ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ ఆమె ఏడాదిన్నర వరకూ జైలు శిక్ష అనుభవించడమే కాదు.. మానసికంగా… కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. కోలుకున్నారు.
ఓ రకంగా శ్రీలక్ష్మి ఎదుర్కొన్న కష్టాలు మరే ఇతర ఐఏఎస్ ఎదుర్కొని ఉండరు. మళ్లీ ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరవాత మాత్రమే ఆమెకు ప్రయారిటీ లభించింది. తెలంగాణ క్యాడర్ నుంచి ఎలాగోలా ఏపీ క్యాడర్‌కు తెప్పించి… చకచకా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇప్పుడు ఆమెపై కేసులు కూడా తేలిపోవడంతో .. చీఫ్ సెక్రటరీగా కూడా చాన్సిచ్చే అవకాశ ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ఆమె కెరీర్లో ఎదుర్కొన్న నష్టాన్ని కొంత వరకైనా భర్తీ చేసుకున్నట్లవుతుంది.
ఇప్పుడు శ్రీలక్ష్మి చేయని తప్పునకు జైలు శిక్ష అనుభవించినట్లయింది. దీనికి బాధ్యులెవరు ? ఆమె.. సీబీఐ లేదా తనపై ఆరోపణలు చేసిన వారిపై న్యాయపోరాటం చేసే అవకాశం ఉంటుంందా ? అలాంటి ప్రయత్నాలు చేస్తారా ? అన్నదానిపై స్పష్టత లేదు కానీ.. ఇప్పటికైతే న్యాయపరంగా ఆమె పూర్తిగా స్వచ్చంగా బయటపడినట్లే., అయితే ఈ హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్స ఉంది.