చంద్రబాబుపై ఏదో విధంగా హైకోర్టుల్లో పిటిషన్లు వేసి..అందులో అడ్డగోలు వాదనలు వినిపించి.. వాటినే తీర్పులన్నట్లుగా అస్మదీయ మీడియాలో ప్రచారం చేసి రాజకీయలబ్ది పొందే కుట్రలు వైసీపీ నాయకులు చాలా కాలంగా చేస్తున్నారు. తాజాగా అలాంటి ప్రయత్నాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఐఎంజీ అనే సంస్థకు చంద్రబాబు అక్రమంగా భూములు కేటాయించారని పన్నెండేళ్ల కిందట విజయసాయిరెడ్డితో పాటు మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను అధారాల్లేవని తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది.
అసలు ఐఎంజీ భూముల పేరుతో వైఎస్ హయాం నంచి ఊదిన బుడగ చిన్నది కాదు. చంద్రబాబు 2003లో అత్యున్నత క్రీడా సౌకర్యాల కల్పన కోసం అమెరికాకు చెందిన ఐఎంజీ సంస్థ భారత సబ్సిడరీకి భూములు కేటాయించారు. తర్వాత చంద్రబాబు ఓడిపోయారు. సీఎం అయిన వైఎస్ మొత్తం రద్దు చేసేశారు. అంటే ఒక్క గజం కూడా ఆ సంస్థకు పోలేదు.అయినా కేటాయింపుల్లో అక్రమాలంటూ ఆయన విచారణ చేయించారు. కేబినెట్ సబ్ కమిటీలు వేసినా ఏమీ తేల్చలేదు. కానీ ఆయన చనిపోయాక మాత్రం…. జగన్ ఇంకా పెద్దగా గాలి ఊదటం ప్రారంభించారు.
మొదట తల్లి విజయలక్ష్మి పేరుతో పిటిషన్లు వేయించారు. ఆధాలేమిటని కోర్టు కొట్టి వేసింది. ఆ తర్వాత మరొకరితో కూడా వేయించారు. అక్కడా అదే పరిస్థితి. అలా కాదని.. మళ్లీ అంటే భూములు కేటాయించిన పదేళ్ల తర్వాత 2012లో హైకోర్టులో విజయసాయిరెడ్డితో పాటు ఏబీకే ప్రసాద్ .. బీఆర్ఎస్ నేత శ్రీరంగారావుతో పిటిషన్లు వేశారు. ఆధారాలు చూపిస్తే తాము దర్యాప్తు జరుపుతామని హైకోర్టు ధర్మాసనానికి సీబీఐ చెప్పింది.. కానీ కనీస ఆధారాలు కూడా లేకపోవడంతో హైకో్టు కొట్టి వేసింది. దీంతో ఐఎంజీ పేరుతో చంద్రబాబుపై చేసిన ఆరోపణలన్నీ ఉత్త బురదేనని తేలిపోయింది.