విద్యార్థులకు ఇంటర్ దశ చాలా కీలకం. ఎందుకంటే… ఇంటర్ లో వచ్చే మార్కులు ఆధారంగా.. ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్ణయం అవుతాయి. ఇప్పుడు ఇంటర్ మార్కుల వెయిటేజీ కీలకం. నీట్ , ఐఐటీ సహా… ఎక్కడ ర్యాంకులు తెచ్చుకోవాలన్నా… ఇంటర్ కీలకం. అలాంటి ఇంటర్మీడియట్ పరీక్ష ఇప్పుడు తెలంగాణలో విద్యార్థులకు చుక్కలు చూపిస్తోంది. అవకతవకల కారణంగా.. ఫెయిలయిన విద్యార్థులదంరి పేపర్లు రీ వాల్యూయేషన్ చేస్తున్నారు. ఇప్పటికీ.. పెద్ద ఎత్తున అవకవతకల ఆరోపణలు వస్తున్నాయి. ఎవరి ఫెయిలయ్యారో.. ఎవరు పాసయ్యారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ గందరగోళం నడుమ… పూర్తి స్థాయి క్లారిటీ రావడానికి మరో రెండు వారాలు సులువుగా పట్టే పరిస్థితి ఉంది.
అందుకే.. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేశారు. మే 16 నుంచి జరగాల్సిన ఈ పరీక్షలు అదే నెల 25కు వాయిదా పడినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించి. మే 25 నుంచి జూన్ 4 వరకూ వీటిని నిర్వహిస్తామని పేర్కొంది. జూన్ 7 నుంచి 10వ తేదీ వరకూ ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. అయితే ఇందులోనూ గందరగోళం ఉంది. సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తు గడువు శనివారంతోనే ముగిసింది. రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ గందరగోళం నడుమ చాలా మంది సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకోలేదని ప్రచారం జరుగుతోంది. సప్లిమెంటరీ పరీక్షల ఆలస్యం ప్రభావం… ఇతర పోటీ పరీక్షలపై పడనుంది. ఇప్పటికే ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారో లేదో క్లారిటీ లేదు.
ఏపీలో ఇప్పటికే ఎంసెట్ పరీక్ష పూర్తయింది. అలాగే… జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ఫలితాలను బట్టి.. ఇంటర్ మార్కులు వెల్లడి కావాల్సి ఉంది. లేకపోతే… విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. ఓ రకంగా ఇప్పుడు… తెలంగాణ విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఏ చిన్న పొరపాటు .. తమ ప్రమేయం లేకుండా.. ఇంటర్ బోర్డు వైపు నుంచి జరిగినా… వారికి తీవ్రమైన నష్టం జరగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.