తెలంగాణలో పొలిటికల్ పవర్ వార్ నడుస్తోంది. ఉదయం లేచినప్పటి నుండి భారత రాష్ట్ర సమితి నేతలు … కరెంట్ ఇష్యూతో మీడియా ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియాలో అదే యుద్ధం చేస్తున్నారు. వారికి కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ నేతల అదే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సవాళ్లు.. ప్రతి సవాళ్లు అన్నీ చోటు చేసుకుంటున్నాయి. ఈ సీన్లో బీజేపీ మిస్ అయింది. నిన్నటిదాకా అనేక విషయాలు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా జరిగేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా వార్ సాగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ మాత్రం సైలెంట్ అయిపోయింది.
అయితే ఇదంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే చేసుకుంటున్నాయా అన్న సందేహం బీజేపీ వర్గాలకు వస్తోంది. ఎందుకంటే ఈ వివాదంలో బీజేపీ పాత్ర లేకుండా పోయింది. కనీసం కేంద్రం ప్రస్తావన ఉన్నా బీజేపీ ఎలాగోలా జోక్యం చేసుకునేది . కానీ విద్యుత్ సంస్కరణలను జోరుగా అమలు చేస్తున్న బీజేపీ ఈ విషయంలో వేలు పెట్టలేకపోతోంది. అంతర్గత పరిణామాల కారణంగా నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. పైగా కిషన్ రెడ్డి అధికారికంగా ఇంకా మంత్రిగానే ఉన్నారు. ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నారు.
21వ తేదీన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటానని కిషన్ రెడ్డి ప్రకటించారు. కానీ బండి సంజయ్ ను ఉన్నపళంగా తప్పించేయడంతో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. ఇటీవల టిఫిన్ బాక్స్ మీటింగ్ లు నర్వహించాలని పార్టీ పిలుపునిచ్చినా తూ తూ మంత్రంగా నిర్వహించారు. బండిసంజయ్ అసలు పట్టించుకోలేదు. ఎలా చూసినా.. ఇప్పుడు మొత్తం తెలంగాణ పొలిటికల్ సీన్ లో బీజేపీ మిస్సవుతోంది.. దీనికి హైకమాండే కారణమని… ఆ పార్టీ క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారు.