తెలంగాణ సర్కార్ హైకోర్టు బలవంతం మీద లాక్ డౌన్ పెట్టింది. మొదటి దశ పది రోజుల పాటు పెద్దగా లాక్ డౌన్ అమలవుతుందో లేదో అన్నట్లుగాఉంది. అయితే.. రెండో విడత పది రోజుల్లో మాత్రం చాలా సీరియస్‌గా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీతో రెండో విడత కూడా పూర్తవుతుంది. ఇక లాక్ డౌన్ ఎత్తివేస్తారా.. లేక కొనసాగిస్తారా అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. రోజుకు.. మూడు, నాలుగు వేల వరకే ఉంటున్నాయి. పాజిటివిటీ రేటు… పది శాతం కన్నా తక్కువగానే ఉంటోంది. ఈ కారణంతో లాక్ డౌన్ అవసరం లేదన్న భావనలో తెలంగాణ సర్కార్ ఉంది.
తెలంగాణలో టెస్టుల సంఖ్యపై విమర్శలున్నాయి. టెస్టులు చేయడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే హైదరాబాద్‌లో ప్రభుత్వం చేసే టెస్టుల కన్నా.,. ప్రైవేటు ల్యాబ్‌లు జరిపే టెస్టులే ఎక్కువ. వీటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదంటున్నారు. అయితే ఆస్పత్రుల్లో చాలా వరకు బెడ్లు ఖాళీ అయ్యాయి. నిన్నామొన్నటి వరకూ గాంధీ ఆస్పత్రి మొత్తం ఫుల్‌గా ఉండేది. ఒక్క బెడ్ కూడా ఖాళీగా ఉండేది కాదు. ఇప్పుడు సగం వరకూ ఖాళీలు ఉన్నట్లుగా చెబుతున్నారు. మరో వైపు ప్రైవేటు ఆస్పత్రుల్ోలనూ అదే పరిస్థితి. పొరుగు రాష్ట్రాల నుంచి అంబులెన్స్‌లను అనుమతిస్తున్నారు. పెద్ద ఎత్తున అంబులెన్స్‌లలో ఇతర రాష్ట్రాల పేషంట్లు వస్తున్నప్పటికీ.. బెడ్లు ఖాళీగా ఉంటున్నాయి. ఆక్సీజన్ అవసరం కూడా సగానికి సగం తగ్గిపోయింది.
ఈ పరిణామాలన్నింటితో… తెలంగాణలో కరోనా పరిస్థితి మరీ సీరియస్‌గా లేదన్న అంచనాకు ప్రభుత్వం వచ్చింది. లాక్ డౌన్ కొనసాగింపు విషయంపై ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. అయితే మొత్తంగా లాక్ డౌన్ ఎత్తివేయడం కన్నా.. సడలింపులు ఇస్తూ.. లాక్ డౌన్ ఎత్తివేస్తే బెటరన్న ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం పది గంటల వరకే పర్మిషన్ ఇచ్చారు. 30వ తేదీ తర్వతా మరికొంత కాలం.. సడలింపు ఇచ్చి.. వారం తర్వాత పెంచుకుటూ పోయే ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వం సడలింపులు ఇవ్వడం ప్రారంభిస్తే.. ఆటోమేటిక్‌గా లాక్ డౌన్ ఎత్తేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది.