తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మరింత ముదురుతున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు వేసవి తీవ్రత ఇలాగే ఉంటుందని.. ఎండతోపాటు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ ముందే వెల్లడించింది. మధ్యాహ్నం తరహలో ఉదయమే భానుడు మండుతున్నాడు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 5వ తేదీ వరకు ఇదే తరహాలో ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో అన్ని జిల్లాలో 43 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉత్తర, తూర్పు జిల్లాలో 46డిగ్రీలు కూడా దాటేసింది. రానున్న నాలుగైదు రోజులు ఎండ వేడిమి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎండ వేడిమికి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.