తెలంగాణలో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఎవరికి వారు తగ్గేదేలే అంటూ డైలాగ్ లు పేల్చుతున్నారు. ప్రత్యర్ధి నేతల కామెంట్స్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని, అందుకు ప్రతిఫలంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు ఉన్నత పదవులు దక్కనున్నాయని రేవంత్ కామెంట్స్ చేయగానే ఆ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ , కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎదురుదాడికి దిగారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ద్వారా..కేసీఆర్ కు గవర్నర్.. కేటీఆర్ కు సెంట్రల్ మినిస్టర్.. కవితకు బెయిల్ తో పాటు రాజ్యసభ.. హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి దక్కనున్నాయని రేవంత్ వ్యాఖ్యలతో సీన్ లోకి కేటీఆర్ ఎంటర్ అయ్యారు. రేవంత్ అర్థం లేకుండా అసంబద్ద వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి త్వరలోనే అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు అంటే నమ్మేస్తారా..?అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత రేవంత్ వ్యాఖ్యలను బండి సంజయ్ కూడా అదే శైలిలో తిప్పికొట్టారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై రేవంత్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో బీఆర్ఎస్ విలీనం బీజేపీలో కాదు.. కాంగ్రెస్ లోనే అవుతుందన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చరిత్ర ఆ పార్టీల సొంతమన్న బండి.. బీఆర్ఎస్ విలీనం అనంతరం కేసీఆర్ కు ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ , కేటీఆర్ కు పీసీసీ చీఫ్ , కవితకు రాజ్యసభ సీటు ఖాయమని జోస్యం చెప్పారు.
వరుసగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ , బండి సంజయ్ లు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.