టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ పోలీసులు రాత్రికిరాత్రి అరెస్ట్ చేశారు. ఆయననే అతి పెద్ద కుట్రదారునిగా చూపించారు. అయితే చాలా సాక్ష్యాలు ఆయన ఫోన్లో ఉంటాయని ఆయన ఫోన్ ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు. కానీ పోలీసులు తన ఫోన్ కొట్టేశారని అది సీఎం దగ్గర ఉందని బండిసంజయ్ ఆరోపించారు. తన ఫోన్ పోయిందని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తన ఫోన్ దొరికే వరకూ తాను విచారణకు వచ్చేది లేదన్నారు.
బండి సంజయ్ విచారణకు సహకరించడం లేదని ఆయన బెయిల్ ను క్యాన్సిల్ చేయాలని పోలీసులు కోర్టుకెళ్లారు. కానీ కోర్టు మాత్రం పిటిషన్ ను కొట్టివేసింది. టెన్త్ పేపర్ లీకేజీ స్కాంతో బండి సంజయ్ కు సంబంధం ఉన్నట్లు నిరూపించడంలో పోలీసులు విఫలమయ్యారని బండి సంజయ్ తరపు న్యాయవాదులు వాదించడంతో .. కోర్టు ఏకీభవించింది. విచారణకు సహకరించాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులో మొబైల్ ను స్వాధీనం చేయాలని కోరడం ఏమిటని.. మొబైల్ మిస్ అయ్యిందని పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఫిర్యాదు నమోదైందన్నారు.
నిజానికి ఇలా ఫిర్యాదు నమోదైన తర్వాత ఫోన్ ను పట్టుకోవడం.. ట్రేస్ చేయడం పోలీసులకు క్షణాల్లో పని ఇటీవలే పోలీసులు ఎక్కడ ఫోన్ పొగొట్టుకున్నా క్షణాల్లో ఇప్పిస్తామంటూ భారీగా పబ్లిసిటీ కూడా చేసుకున్నారు. కానీ బండి సంజయ్ ఫోన్ ను మాత్రం పట్టుకోవడం లేదు. ఆ ఫోన్ దొరికితే కేసు క్లారటీ వస్తుంది. కానీ పోలీసులే ఓ ఫోన్ నుపట్టుకోలేక బండి సంజయ్ ను ఫ్రీగా వదిలేస్తున్నట్లుగా పరిస్థితి ఉంది.