తెలంగాణ పోలీసులకు వైసీపీ నేతల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ..జరిగే ప్రచారంపై కూడా.. ఫిర్యాదులతో.. నేరుగా కమిషనర్ల వద్దకే క్యూ కడుతున్నారు. వాళ్లు వైసీపీ నేతలు అయితే చాలు.. కమిషనర్లు కూడా లేచి నిలబడి ఫిర్యాదు తీసుకుని ఫోటోలకు ఫోజులిచ్చి.. తామే ఆ ఫిర్యాదును.. సంబంధిత స్టేషన్లకు పంపుతున్నారు. మామూలుగా అయితే.. ఫలానా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసుకోండి అని చెబుతారు. కానీ.. తెలంగాణలో వైసీపీ నేతలకు.. అధికార పార్టీ నేత హోదా ఉన్నట్లుగా ఉంది. అందుకే.. వెళ్లి ఫిర్యాదు చేయడం ఆలస్యం… తెలంగాణ పోలీసులు… కేసు నమోదు చేసేస్తున్నారు.
ఐటీ గ్రిడ్ అనే కంపెనీ వ్యవహారంలో.. విజయసాయిరెడ్డి.. పోలీసులకు నిర్దేశించిన పత్రం.. బయటకు వచ్చి.. కలకలం రేగుతున్న సమయంలోనూ… పోలీసులు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా… మొదట పెట్టిన కేసుకు.. సంబంధం లేకుండా.. కొత్త కొత్తగా.. కేసులు పెట్టుకుంటూ… ఆ కంపెనీని ఎలాగైనా వెంటాడాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీడియాకు.. చిలువలు, పలువలుగా… లీకులు ఇస్తున్నారు. అసలు అక్రమ సమాచారం ఏమి ఉందో.. వాటిని ఎలా దుర్వినియోగం చేశారో మటుకు.. ఇంత వరకు కోర్టుకు చెప్పలేకపోయారు. ఆ ఎపిసోడ్ అలా ఉండగానే… ఎన్నికల సమయంలో పదుల సంఖ్యలో.. కేసులు నమోదు చేశారు. అందులో ఎవరో తెలంగాణ ఇంటలిజెన్స్ పేరుతో సర్వే చేశారని.. సోషల్ మీడియాలో వీడియో పెడితే.. వెంటనే కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఏబీఎన్‌లో వచ్చిన విజయసాయిరెడ్డి వాయిస్ టేప్ పైనా ఫిర్యాదు చేశారు.
అంతకు ముందు షర్మిల సహా.. అనేక మంది.. ఇలాంటి ఫిర్యాదులు చేశారు. తాజాగా.. లక్ష్మిపార్వతి కూడా..నేరుగా కమిషనర్ వద్దకు వెళ్లారు. కోటి అనే వ్యక్తి తనపై దుష్ప్రచారం చేస్తున్నాడని.. ఆమె ఆరోపించారు. నిజానికి ఈ కోటి … లక్ష్మిపార్వతిపైనే… వినుకొండలో ఫిర్యాదు చేశారు. అప్పుడు కామ్‌గా ఉండి.. ఇప్పుడు భరోసా వచ్చిందేమో కానీ.. నేరుగా…కమిషనర్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ప్రకటించిన టీవీ చానల్ ను.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తులపైనా.. కంప్లయింట్ చేశారు. నిజానికి… అసలు తన చాట్ , వాయిస్.. అబద్దమని… వాటిని మార్ఫింగ్ చేశారని కానీ.. మరొకటని కానీ.. లక్ష్మిపార్వతి చెప్పడం లేదు. దుష్ప్రచారం అని మాత్రమే చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణ పోలీసులు అసలు విషయాల కన్నా.. వైసీపీ కోసం మాత్రం ఓవర్ టైం వర్క్ చేస్తున్నారన్న అభిప్రాయం అంతటా ఏర్పడుతోంది.