తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ చర్చల కోసం.. వెళ్తూ.. వెళ్తూ.. విశాఖలో .. శారదా పీఠాన్ని సందర్శించారు. అది ఆయన వ్యక్తిగత పర్యటన రాజకీయాలకు సంబంధం లేదు. కానీ.. ఇక్కడ అసలు విశేషం ఏమిటంటే… కేసీఆర్ విశాఖ విమానాశ్రయం నుంచి శారదా పీఠం వెళ్లడానికి .. ఆ తర్వాత మళ్లీ భువనేశ్వర్ బయలుదేరే వరకూ.. కేసీఆర్కు భద్రతను తెలంగాణ పోలీసులే కల్పించారు. ప్రత్యేకంగా కేసీఆర్ భద్రత కోసం.. బస్సుల్లో పోలీసుల్ని రెండు రోజుల ముందే విశాఖకు తరలించారు. శారదాపీటం చుట్టుపక్కల మొత్తం… తెలంగాణ పోలీసులే భద్రతను పర్యవేక్షించారు. ఏపీ పోలీసులు తమ విధిగా.. తాము బందోబస్తు నిర్వహించారు కానీ.. అసలు భద్రత మాత్రం తెలంగాణ పోలీసులే చూసుకున్నారు.
అయితే… భువనేశ్వర్ లో మాత్రం.. తెలంగాణ పోలీసులు భద్రత కల్పించ లేదు. అక్కడి పోలీసులే సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కేసీఆర్ శారదా పీఠంలో… స్వరూపానందకు సాష్టాంగ ప్రమాణం చేసి.. అక్కడున్న ఆలయాలను దర్శించుకుని… భోజనం చేసి.. భువనేశ్వర్ పయనమైన తర్వాత.. తెలంగాణ పోలీసులు హైదరాబాద్ కు పయనమయ్యారు. ఒడిషాలో లేని సెక్యూరిటీ భయం.. కేసీఆర్కు విశాఖలో ఎందుకొచ్చిందన్నదే అసలు ప్రశ్న. ఏపీ లో తనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. ఫోన్లు పగిలిపోయేంతగా… మెసెజులు వస్తున్నాయని చెప్పుకున్న కేసీఆర్.. ఏపీ ప్రజల విషయంలో.. ఇసుమంత కూడా నమ్మకం పెట్టుకోలేదని.. ఆయన సెక్యూరిటీ కోసం.. బస్సుల్లో తరలి వచ్చిన పోలీసులే చెబుతున్నారు.
విశాఖలో ఓ రాజకీయ పర్యటన కాకుండా.. కేవలం ఓ స్వామిజీని దర్శించుకోవడానికి వస్తేనే .. అంత బందోబస్తు ఏర్పాటు చేసుకున్న కేసీఆర్… రేపు రాజకీయ పర్యనటకు వస్తే ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఏపీ పోలీసులపై ఏ మాత్రం నమ్మకం లేకుండా.. సొంత రాష్ట్రం నుంచి పోలీసుల్ని తెచ్చుకుంటే.. రేపు వేలు, కాలు పెడతామన్నారు కదా..ఎలా సాధ్యమవుతుంది..?.