తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండంకెల స్థానాలు దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ పోరులో అ ధిక సీట్లు సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించాలని కృత నిశ్చయంతో ఉంది. కేంద్రంలో తి రిగి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న బి జెపి డబుల్ డిజిట్ సీట్లు సాధించేందుకు కసరత్తు లు చేస్తున్నాయి.
రెండు పార్టీలకూ బీఆర్ఎస్ నేతలే బలమైన అభ్యర్థులుగా కనిపించారు. తమ పార్టీ వారిని పక్కన పెట్టి పిలిచి మరీ టిక్ెట్లు ఇచ్చాయి. . సీనియర్లు, కొత్త అభ్యర్థులు అనే తేడా లేకుండా పార్టీ టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తారనుకునే అభ్యర్థు ల కోసం ఆయా పార్టీలు టికెట్లు ఇచ్చాయి. ఇత ర పార్టీలలో ఉన్న బలమైన నాయకులను గుర్తిం చి వారికి తమ పార్టీలోకి ఆహ్వానించి వెంటనే టి కెట్లు కేటాయించారు. ప్రత్యర్థి పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బిజెపి పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రంజిత్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి , దానం నాగేందర్ వంటి ఫిరాయింపుదారులకు టిక్కెట్ ఇచ్చారు. మిగిలిన స్థానాల్లోనూ వారే ఉంటారు. ఇక బీజేపీ పూర్తిగా ఫిరాయింపుల మీదనే ఆధారపడింది. పదిహేడు మంది లోక్ సభ అభ్యర్థుల్లో ఎనిమిది మంది నిన్నామొన్న పార్టీలో చేరిన వారే. ఎక్కువ మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే.
తమ పార్టీల్లో ఉన్న బలమైన నేతలకు అవకాశాలు కల్పించలేదు… కానీ పిలిచి మరీ పక్క పార్టీల నేతలకే పెద్దపీట వేశారు. ఫిరాయిస్తేనే బలమైన నేత అన్నట్లుగా తెలంగాణ రాజకీయం మారింది.